ప్రపంచ స్థాయి విద్యా బోధనకు.. | - | Sakshi
Sakshi News home page

ప్రపంచ స్థాయి విద్యా బోధనకు..

Published Sat, Dec 21 2024 12:18 AM | Last Updated on Sat, Dec 21 2024 12:18 AM

-

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలను దరి చేర్చేందుకు గత ప్రభుత్వం 1వ తరగతి నుంచే ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్‌, హైస్కూల్‌ ప్లస్‌లు, టోఫెల్‌ పరీక్ష విధానాన్ని అమల్లోకి తెచ్చింది. విద్యార్థి తరగతిలో విన్న తర్వాత ఇంటికి వెళ్లి మరొకసారి చదువుకునే విధంగా ఈ ట్యాబ్‌ల ద్వారా అవకాశం కల్పించారు. ఇక పాఠశాలలో కూడా స్మార్ట్‌ బోధనకు అనుగుణంగా జిల్లాలో తొలి విడతలో 1,324 ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌, 428 స్మార్ట్‌ టీవీలను ఏర్పాటు చేశారు. రెండో విడతలో 1 నుంచి 5వ తరగతి వరకు స్మార్ట్‌ టీవీలు, 6 నుంచి 10వ తరగతి వరకు ఐఎఫ్‌పీ ద్వారా విద్యాబోధకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని 41 పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ను అమలు చేశారు. టోఫెల్‌ పరీక్ష విధానంపై శిక్షణ ఇచ్చారు. విద్యార్థులకు పూర్తిగా ఇంగ్లిష్‌ మీడియంలో బోధించి, పరీక్షలు నిర్వహించే విధంగా తీర్చిదిద్దారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ తరహా స్థాయి విద్యా ప్రమాణాలు అందుబాటులోకి రావాలంటే.. విద్య పరంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లోనే మరో యాభై ఏళ్లు పడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement