పునాది బలంగా ఉంటేనే అద్భుత ఫలితాలు
● ఎస్సీఈఆర్టీ పరిశీలకురాలు మాధవి
నెల్లూరు(టౌన్): విద్యార్థులకు పునాది బలంగా ఉంటేనే భవిష్యత్‌లో అద్భుత ఫలితాలు సాధిస్తారని ఎస్సీఈఆర్టీ పరిశీలకురాలు మాధవి తెలిపారు. వెంకటాచలం మండలం గొలగమూడిలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్‌లో జరుగుతున్న ఎఫ్‌ఎన్‌ఎల్ శిక్షణను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1, 2 తరగతుల్లో భాష, గణిత పరంగా బలంగా ఉండాలన్నారు. శిక్షణలో అందిస్తున్న సూచనలను ఉపాధ్యాయలు వారి పాఠశాలల్లో అమలు చేయాలన్నారు. గుణాత్మక విద్యను అందించడం, సమయ విలువ, పాలన గురించి తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎంఓ సుధీర్‌బాబు, ఆర్పీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment