రూ.10 కోట్ల భూమి.. హాంఫట్
ఉదయగిరి: ప్రభుత్వ మేత పొరంబోకు భూమికి కూట మి నేతలు ఎసరు పెడుతున్నారు. వరికుంటపాడు మండలం గణేశ్వరపురంలో సుమారు రూ.10 కోట్లు విలువ చేసే దాదాపు 80 ఎకరాల భూమి ఇంతకు ముందే ఆక్రమణకు గురి కాగా, తాజాగా మరో 70 ఎకరాల కబ్జా పర్వాన్ని సాగిస్తున్నారు. గ్రామ సర్వే నంబరు 169లో 277.95 ఎకరాలు, 196లో 177.34 ఎకరాల మేతపొరంబోకు భూమి ఉంది. ఈ భూమి కొన్నేళ్లుగా ఆక్రమణకు గురవుతోంది. ఇప్పటికే భూ ముల ఆక్రమణలపై గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. తాజాగా మరో 70 ఎకరాలు స్వాహా చేసేందుకు మూడు రోజుల నుంచి చెట్లు తొలగించి ట్రాక్టర్ ద్వారా దుక్కి చేస్తున్నారు. ఈ విషయం వీఆర్వోకు తెలిపినా, ఆక్రమణదారులను ఆపలేదని గ్రామస్తులు చెబుతున్నారు.
ఆందోళనలో పశుపోషకులు
గ్రామంలోని సుమారు 200 కుటుంబాలు కేవలం పశువులు పోషణ, మేకలు, గొర్రెలు పెంపకం ద్వారా జీవనం సాగిస్తుంటారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలు జీవాల పోషణ ద్వారానే జీవనం సాగిస్తున్నారు. ఇతరులు పశువులతో కుటుంబాలను పోషించికుంటున్నారు. జిల్లాలోనే అత్యధిక పాలు ఉత్పత్తి చేసే గ్రామాల్లో ఈ గ్రామం ముందు వరుసలో ఉంటుంది. మేత పొరంబోకు కబ్జా చేసి ఆక్రమణ చేస్తే పశువులు, జీవాలు మేపుకునే అవకాశం ఉండదు. దీంతో అనేక కుటుంబాలు జీవానాధారం కోల్పోయి వీధిన పడే పరిస్థితి ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేరు చెప్పుకుంటూ మేత పొరంబోకు ఆక్రమణ చేస్తున్నారని, ఈ భూములు ఆక్రమణకు గురైతే జీవనాధారం పోతుందని అధికార పార్టీకే చెందిన కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆక్రమిత భూములను పరిశీలించిన సబ్ కలెక్టర్
గ్రామంలో ఆక్రమణకు గురైన పశువుల మేత పోరంబోకు భూమిని కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ శుక్రవారం పరిశీలించి గ్రామస్తులతో మాట్లాడారు. ఆక్రమణకు గురైన భూములు వివరాలు సర్వేయర్, తహసీల్దార్‌ను అడిగి తెలుసుకున్నారు. భూము లు ఆక్రమించిన వారికి నోటీసులు ఇచ్చి అందులో నుంచి తొలగించాలని ఆదేఽశాలు ఇచ్చారు. ఎవరైనా ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గణేశ్వరపురంలో రెచ్చిపోతున్న
ఆక్రమణదారులు
తాజాగా మరో 70 ఎకరాల మేత పొరంబోకు కబ్జాకు సిద్ధం
చెట్లు తొలగించి ట్రాక్టర్‌తో దుక్కి
ముఖం చాటేసిన రెవెన్యూ అధికారులు
సబ్ కలెక్టర్‌కు పలువురి ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment