నెల్లూరు(క్రైమ్): మితిమీరిన వేగంతో మోటార్‌బైక్ స్పీడ్‌బ్రేకర్‌ను ఎక్కడంతో వెనుక కూర్చొని ఉన్న మహిళ కిందపడి తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. కర్ణాటక రాష్ట్రం మైసూర్‌లో షేక్ ముంతాజ్ (37) తన కుమారుడు షఫీతో కలిసి నివాసం ఉంటోంది. అక్కడ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈనెల 17వ తేదీన ఆమె నెల్లూరు బుజబుజనెల్లూరులోని తన సోదరి నాగూర్‌బీ వద్దకు వచ్చింది. శనివారం సాయంత్రం ముంతాజ్ నగరంలోని పని ఉందని చెప్పి బయటకు వెళ్లింది. అర్ధరాత్రి ముంతాజ్ తన అక్క కుమారుడు తారీక్ బైక్‌పై స్నేహితురాలు వరలక్ష్మితో కలిసి మైపాడుగేటు సెంటర్ నుంచి మినీబైపాస్ మీదుగా బుజబుజనెల్లూరుకు బయలుదేరింది. నారాయణ స్కూల్ సమీపంలోకి వచ్చేసరికి తారీక్ బైక్‌ను వేగంగా నడుపుతూ స్పీడ్ బ్రేకర్‌ను ఎక్కించాడు. బైక్ అదుపుతప్పి చివరన కూర్చొని ఉన్న ముంతాజ్ కిందపడి తలకు తీవ్రగాయమై మృతిచెందింది. ఈ విషయాన్ని తారీక్ నాగూర్‌బీకి తెలియజేశాడు. వారు ఘటనా స్థలానికి చేరుకుని విగతజీవిగా పడి ఉన్న ముంతాజ్‌ను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ప్రమాద ఘటనపై నార్త్ ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment