గంజాయి హబ్‌గా కావలి
కావలి కేంద్రంగా గంజాయి హబ్ నడుస్తున్నట్లు ఇటీవల అరెస్ట్‌ల పర్వంతో తెలుస్తోంది. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గంజాయిని నిరోధించేందుకు పక్కా ప్రణాళికలతో వ్యవహరించింది. సాగు చేసే భూముల్లోని గంజాయి తోటలను ధ్వంసం చేసింది. సెబ్‌తోపాటు పోలీసు శాఖ కూడా నిఘా పెట్టి మూలల నుంచే ఏరివేత దిశగా చర్యలు చేపట్టింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలకులు, పోలీసులు రెడ్‌బుక్ రాజ్యాంగంపై దృష్టి పెట్టడంతో గంజాయి వ్యాపారులు కోరలు చాస్తున్నారు. ఇక్కడి నుంచే నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో గంజాయి విక్రేతల నెట్‌వర్క్ విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావడంతో అప్రమత్తమయ్యారు. ఈ వ్యాపారంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తుండడంతో పోలీసులే నివ్వెరపోతున్నారు. ఈ నెట్‌వర్క్ తీగ దొరకడంతో డొంక కదిలించే దిశగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
రాజమండ్రి, విశాఖ నుంచి
హోల్‌సేల్‌గా కొనుగోలు
● నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తృతంగా అమ్మకాలు
● విక్రేతల ముఠాలో దంపతులు,
మహిళలు
● హోల్‌సేల్ విక్రేతల కోసం పోలీసుల వేట
● పోలీసులకు సవాల్‌గా హోల్‌సేల్
సరఫరాదారుల అరెస్ట్‌లు
కూటమి ప్రభుత్వం వచ్చాకే..
Comments
Please login to add a commentAdd a comment