చందన, సీఎంఆర్‌లో వీక్లీ డ్రా
నెల్లూరు(బృందావనం): సంక్రాంతి, క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా చందన, సీఎంఆర్ ప్రవేశపెట్టిన ఎక్స్‌ప్రెస్ సేల్ రెండో వీక్లీ డ్రాను రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర టీడీపీ ఆరోగ్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ జెడ్.శివప్రసాద్‌లు ఆదివారం తీశారు. నెల్లూరు సంతపేటకు చెందిన ధన్విక్, మైపాడు రోడ్డు 4వ మైలుకు చెందిన వై.సుజితను టీవీఎస్ జెస్ట్ స్కూటీల విజేతలుగా ప్రకటించారు. అలాగే డైలీ డ్రాలో విజేతలైన 70 మందికి గ్రైండర్, మిక్సీ, ఎలక్ట్రికల్ కుక్కర్, డిన్నర్ సెట్ తదితరాలను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులురెడ్డి, శివప్రసాద్‌లు మాట్లాడుతూ అత్యంత తక్కువ ధరలకు నాణ్యమైన వస్త్రాలు, బంగారు ఆభరణాలు ఇవ్వడం చందన, సీఎంఆర్‌లకే దక్కిందన్నారు. కార్యక్రమంలో సీఎంఆర్ అధినేతలు మావూరి శ్రీనివాసరావు, ఎం.సంతోష్‌రామమోహన్, మోపూరు పెంచలయ్య, శైలేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment