● రాళ్లపాడు రైతుకు నీటి కష్టాలు | - | Sakshi
Sakshi News home page

● రాళ్లపాడు రైతుకు నీటి కష్టాలు

Published Mon, Dec 23 2024 12:09 AM | Last Updated on Mon, Dec 23 2024 12:09 AM

● రాళ

● రాళ్లపాడు రైతుకు నీటి కష్టాలు

ప్రాజెక్ట్‌ కుడి కాలువ గేటు మరమ్మతులు చేపట్టలేకపోయిన నిపుణులు

గేటును పైకి లేపడం కష్టసాధ్యమని

తేల్చిన వైనం

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం

నీరందక ఆయకట్టులో

ఎండుతున్న వరినాట్లు

పాతిక వేల ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకం

రాళ్లపాడు ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జలవనరుల శాఖ నిర్లక్ష్యం.. పాలకుల అసమర్థకు రాళ్లపాడు ప్రాజెక్ట్‌ నిదర్శనం. నారా ప్రభుత్వం చేతకాని తనానికి ఈ ప్రాజెక్ట్‌ ఉదాహరణగా నిలుస్తోంది. 1.1 టీఎంసీల నీటి నిల్వ సామ ర్థ్యం కలిగిన చిన్న ప్రాజెక్ట్‌ కుడి కాలువ గేటు ఊడిపోతే మరమ్మతులు చేపట్టలేక మూడు వారాలుగా కుస్తీ పడుతోంది. నిన్నా.. మొన్నటి వరకు మరమ్మతులు సమర్థవంతంగా పూర్తి చేస్తామంటూ గొప్పలు చెప్పిన ఎమ్మెల్యేలు, ఇంజినీరింగ్‌ నిపుణులు ఇప్పుడు చేతు లెత్తేశారు. ప్రాజెక్ట్‌ నిండా నీళ్లు ఉన్నా.. ప్రభుత్వ వైఫల్యం కారణంగా దాదాపు 25 వేల ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారింది. రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేపడుతున్నా.. ప్రత్యామ్నాయంగా సాగునీటిని విడుదల చేసే విషయంలో మీనమేషాలు లెక్కిస్తుండడంతో దుక్కు లు, నాటిన నాట్లు ఎండిపోతున్నాయి. మరో వైపు నారుమళ్లు ముదిరిపోతున్నాయి.

చిత్తశుద్ధి లేదా? చేసే ఉద్దేశం లేదా?

ఒక టీఎంసీ కంటే తక్కువ నిల్వ ఉన్న ప్రాజెక్ట్‌ గేటుకు మరమ్మతులు చేపట్టలేక ప్రభుత్వం చేతులెత్తేసిందంటే.. చిత్తశుద్ధి కొరవడిందా? అసలు ఈ సమస్యను పరిష్క రించే ఉద్దేశమే లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో జలవనరుల శాఖలో అత్యంత సమర్థులైన ఇంజినీరింగ్‌ నిపుణులు ఉన్నా.. వారి సేవలను వినియోగించుకోలేకపోవడం చూస్తే.. ప్రభుత్వం తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్‌ కు సంబంధించి ఒక గేటు కొట్టుకుపోతే.. రోజుల వ్యవధిలో పునరుద్ధరించగలిగారు. ఉధృతంగా ఉరకలెత్తే నదుల్లో నీటిని దారిమళ్లించి పెద్దపెద్ద డ్యామ్‌లు కడుతున్న, ఉవ్వెత్తున ఎగిసిపడే సముద్ర జలగర్భంలోకి చొచ్చుకెళ్లి పోర్టుల నిర్మాణాలు, జట్టీలు, వంతెనలు నిర్మించగలే టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో ఈ చిన్నపాటి ప్రాజెక్ట్‌ గేటుకు మరమ్మతులు చేయలేకపోతుందంటే గొప్పలు చెప్పుకునే నారా ప్రభుత్వం సామర్థ్యమెంతో అర్థమవుతోంది.

ఖర్చుకు వెరసి.. వెనక్కి తగ్గారా?

ఈ గేటుకు మరమ్మతులు చేపట్టడం కొంచెం కష్టతరమే అయినా.. ప్రత్యామ్నాయ చర్యలతో చేపట్టే అ వకాశం ఉందని కొందరు విశ్రాంత ఇంజినీరింగ్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వందల టీఎంసీల నిల్వ ఉన్న తుంగభద్ర ప్రాజెక్ట్‌ గేటు కొ ట్టుకుపోతే.. పునరుద్ధరించగలిగితే.. ఇది చేయలేమా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం కేవలం ఖర్చుకు వెరిసి గేటు మరమ్మతులకు వెనకడుగు వేసినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఎండుతున్న పంటలు

ప్రాజెక్ట్‌ కుడి, ఎడమ కాలువల కింద దాదాపు 25 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్ట్‌ ఎడమ కాలువ పరిధిలో ఉండే ఆయకట్టు చాలా స్వల్పం. అత్యధికంగా 20 వేల ఎకరాల ఆయకట్టు కుడి కాలువ పరిధిలోనే ఉంది. మెజార్టీ రైతులు ఈ ఏడాది వరి సాగు చేయాలనే లక్ష్యంతో వరినార్లు సాగుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం కుడి కాలువకు నీరు విడుదల లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

రైతుల ఆందోళన పట్టని ప్రభుత్వం

రాళ్లపాడు రైతులు పార్టీలకు అతీతంగా రోడ్డెక్కి ఆందోళనలు చేపడుతున్నా.. ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. దాదాపు ఒక నియోజకవర్గం మొత్తం సాగు భూములు బీడు భూములు మారే పరిస్థితులు కళ్ల ముందే కనిపిస్తున్నా.. కనీసం ముఖ్యమంత్రి కానీ, జలవనరుల శాఖ మంత్రి కానీ ప్రాజెక్ట్‌ కింద రైతుల ఆందోళన తీర్చే ప్రయత్నం చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కుడి కాలువ గేటు సమస్య పరిష్కారం కాదని నిపుణులు తేల్చి చెప్పారు. మోటార్లు ఏర్పాట్లు చేసి కాలువకు నీరు పంపింగ్‌ చేయడం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. అయినా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యం వహించింది.

నీటి పంపింగ్‌లో చిత్తశుద్ధి ఏది?

దాదాపు 15 రోజుల నుంచి కుడి కాలువ పరిధిలోని ఆయకట్టు రైతులు నీటి కోసం ఆందోళన చేస్తూనే ఉన్నారు. రైతుల ఆందోళనలు ఉధృతం కావడంతో నామమాత్రంగా కేవలం 15 హార్స్‌, 20 హార్స్‌ పవర్‌ గల రెండు మోటార్లు పెట్టి.. కుడి కాలువకు అరకొరగా పంపింగ్‌ చేస్తున్నారు. దిగువ వరకు సాగునీరు అందాలంటే 200 క్యూసెక్కులకు పైగా నీటిని కాలువకు విడుదల చేయాలి. కానీ ప్రస్తుతం 120 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు అధికారులు చెబున్నారు. దీంతో కాలువ కింద ముందు ఉన్న రైతులు అడ్డు కట్టలు వేసుకుని తమ పంటలను కాపాడుకునే పనిలో పడ్డారు. దీంతో చివరి ఆయకట్టు ఉన్న చినపవని, పెదపవని, మక్కెవారిపాళెం, సత్యనారాయణపురం, మేదరమిట్లపాళెం, జంగాలపల్లి, సీతారామపురం, అన్నెబోయినపల్లి, అంగిరేకులపాడు తదితర గ్రామాలకు చెందిన రైతులు నీటి కోసం అల్లాడుతున్నారు. ఆయా గ్రామాల్లో సాగు చేసిన నారుమడులు, వరినాట్లు పూర్తిగా ఎండిపోతున్నాయి. పొలాలు నెర్రెలిచ్చి నీటి కోసం ఎదురు చూస్తున్నాయి.

మరమ్మతులు చేస్తుంటే రైతుల ఎదురుచూపులు

సమస్య ఏమిటంటే..

రాళ్లపాడు ప్రాజెక్ట్‌ పూర్తి సామర్థ్యం 24 అడుగులు (1.11 టీఎంసీలు). దాదాపు రెండేళ్ల తర్వాత సమృద్ధిగా కురిసిన వర్షాలకు 20 అడుగుల మేర ప్రాజెక్ట్‌కు నీరు చేరింది. పంట కాలువలకు నీటిని విడుదల చేసేందుకు దాదాపు 20 రోజుల క్రితం కుడి కాలువ షట్టర్‌ గేట్‌ పైకి ఎత్తే క్రమంలో ఊడి కిందకు పడిపోయింది. ఈ గేటును పైకి లేపి నీటి విడుదల ప్రక్రియను కొనసాగించాల్సి ఉంది. రాష్ట్రంలోనే ప్రాజెక్ట్‌ గేట్ల మరమ్మతుల్లో నిపుణులైన పలువురిని అధికారులు ప్రాజెక్ట్‌ వద్దకు రప్పించారు. దాదాపు పది రోజుల పాటు శ్రమించిన పలువురు నిపుణులు కష్టమని, ప్రాజెక్ట్‌లో నీటి సమస్య తగ్గే వరకు ఏమీ చేయలేమని తేల్చారు. దీంతో కుడి కాలువకు నీటిని విడుదల చేసే పరిస్థితి లేకుండా పోయింది.

కుడి కాలువకు పూర్తిస్థాయిలో నీరు

లింగసముద్రం: రాళ్లపాడు ప్రాజెక్ట్‌ కుడికాలువకు పూర్తిస్థాయిలో నీరు విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ ఓ. ఆనంద్‌ చెప్పారు. ఆదివారం రాళ్లపాడు కుడి కాలువ తూమును, కాలువకు వస్తున్న నీటిని పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గేటు పైకి లేవకపోవడంతో ప్రత్యా మ్నాయ ఏర్పాట్లు చేసి 110 క్యూసెక్కుల నీరు కాలువలో వెళ్తున్నప్పటికీ చివరి భూములకు అందడం లేదని తన దృష్టికి వచ్చినట్లు చెప్పారు. మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీ కరీంనగర్‌ నుంచి నాలుగు మోటార్లను తెప్పించినట్లు చెప్పారు. ఆదివారం సాయంత్రానికి రెండు మోటార్లు బిగించి 60 క్యూసెక్కులు అదనంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. సోమవారం మరో రెండు మోటార్లను బిగించి అదనంగా మరో 60 క్యూసెక్కులు ఇవ్వడం జరుగుతోందన్నారు. కందుకూరు సబ్‌కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ, ఎస్‌ఈ వరలక్ష్మి, ఇరిగేషన్‌ అధికారులు ఉన్నారు.

రైతుల జీవనాడి రాళ్లపాడు ప్రాజెక్ట్‌ గేటు మరమ్మతులు చేపట్టడంలో నారా ప్రభుత్వం అసమర్థత బయటపడింది. ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పటికీ దాదాపు మూడు వారాలుగా ఈ సమస్యను పరిష్కరించడం చేతకాక.. చేతులెత్తేసింది. గలగలపారే నదుల్లో నీటిని దారి మళ్లించి డ్యామ్‌లు కడుతున్నారు. నిండుకుండ లాంటి ప్రాజెక్ట్‌ గేట్లు కొట్టుకుపోతే పునరుద్ధరించగలుగుతున్నారు. ఉవ్వెత్తున ఎగసి పడే సముద్ర గర్భం నుంచే పటిష్ట పునాదులు వేయగలిగే సాంకేతిక సామర్థ్యం ఉంది. గొప్ప గొప్ప ప్రాజెక్ట్‌లు కట్టామని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఆఫ్టరాల్‌ చిన్న గేటుకు మరమ్మతులు చేయించలేక చతికల పడ్డారు. వేలాది ఎకరాలను బీడుగా మార్చేస్తున్నారు.

ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే

రాళ్లపాడు ప్రాజెక్ట్‌ రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కాలువ కు ప్రత్యామ్నాయంగా నీటిని విడుదల చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ చిన్నపాటి గేటుకు మరమ్మతులు చేపట్టలేకపోవడం చూస్తే.. చంద్రబాబు ప్రభుత్వ అసమర్ధతకు అద్దం పడుతోంది. ప్రస్తుతం పంటలు ఎండిపోతున్నాయి. మా ప్రభుత్వంలో రైతులను ఆదుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చే శాం. ఏ సమస్య వచ్చినా సకాలంలో పరిష్కరించే విధంగా చర్యలు ఉండేవి. ఈ సమస్యను పరిష్కరించకుంటే.. రైతుల పక్షాన నిలబడి ఆందోళనకు చేయడానికి సిద్ధంగా ఉన్నాం.

– కాకాణి గోవర్ధన్‌రెడ్డి,

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

రైతులను ఆదుకోవాలి

దాదాపు 20 రోజుల నుంచి రాళ్లపాడు ప్రాజెక్ట్‌కింద రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కాలువకు నీటిని విడుదల చేసి రైతులను వెంటనే ఆదుకోవాలి. ఇప్పటి వరకు అటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రస్తుతం పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ప్రాజెక్ట్‌ నిండా నీరు ఉన్నా ఆయకట్టు రైతులకు నీరు ఇవ్వలేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. ఒక నియోజకవర్గం మొత్తం బీడు భూములుగా మారే పరిస్థితులు ఉండడంతో రైతుల కళ్లల్లో నిర్వేదం కనిపిస్తోంది.

– బుర్రా మధుసూదన్‌యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి

No comments yet. Be the first to comment!
Add a comment
● రాళ్లపాడు రైతుకు నీటి కష్టాలు 1
1/8

● రాళ్లపాడు రైతుకు నీటి కష్టాలు

● రాళ్లపాడు రైతుకు నీటి కష్టాలు 2
2/8

● రాళ్లపాడు రైతుకు నీటి కష్టాలు

● రాళ్లపాడు రైతుకు నీటి కష్టాలు 3
3/8

● రాళ్లపాడు రైతుకు నీటి కష్టాలు

● రాళ్లపాడు రైతుకు నీటి కష్టాలు 4
4/8

● రాళ్లపాడు రైతుకు నీటి కష్టాలు

● రాళ్లపాడు రైతుకు నీటి కష్టాలు 5
5/8

● రాళ్లపాడు రైతుకు నీటి కష్టాలు

● రాళ్లపాడు రైతుకు నీటి కష్టాలు 6
6/8

● రాళ్లపాడు రైతుకు నీటి కష్టాలు

● రాళ్లపాడు రైతుకు నీటి కష్టాలు 7
7/8

● రాళ్లపాడు రైతుకు నీటి కష్టాలు

● రాళ్లపాడు రైతుకు నీటి కష్టాలు 8
8/8

● రాళ్లపాడు రైతుకు నీటి కష్టాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement