దూరం నుంచి వచ్చి.. వినతులిచ్చి..
నెల్లూరు రూరల్: జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి జనం పెద్దఎత్తున వచ్చి సమస్యలపై అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జేసీ కె.కార్తీక్, డీఆర్వో ఉదయ్‌భాస్కర్‌రావు, జెడ్పీ సీఈఓ విద్యారమ, జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్‌రెడ్డి, డ్వామా పీడీ గంగా భవానీ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జేసీ మాట్లాడుతూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. కాగా ఈ వారం కూడా అత్యధికంగా రెవెన్యూకు సంబంధించిన వినతులు 116 వచ్చాయి. మున్సిపల్ శాఖవి 25, సర్వేవి 22, పంచాయతీరాజ్‌వి 15, పోలీస్ శాఖవి 10 తదితర వినతిపత్రాలు అందాయి. కార్యక్రమంలో డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగరాజాకుమారి, జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవాణి, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, డీటీసీ చందర్, ఏపీ మైక్రో ఇరిగేషన్ పీడీ శ్రీనివాసులు, గృహ నిర్మాణ శాఖ పీడీ వేణుగోపాల్, డీఈఓ బాలాజీరావు, సోషల్ వెల్ఫేర్ డీడీ శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
● నెల్లూరులోని 1, 12వ డివిజన్లలోని గిరిజనులు తమ సమస్యలు పరిష్కరించాలని గిరిజన సంక్షేమ సంఘం నేత లక్ష్మణ్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. ఇంటి స్థలాలకు దరఖాస్తు చేసుకోవాలంటే సచివాలయాల్లో తిరస్కరిస్తున్నారని, దీనిపై దృష్టి సారించాలని కోరారు.
● నెల్లూరు రూరల్ మండలం కొండ్లపూడి పంచాయతీలో 600 మందికి స్థలాలిచ్చారు. చాలామంది ఇళ్లు నిర్మించుకున్నారు. అయితే రోడ్డు సౌకర్యం లేదని, చర్యలు తీసుకోవాలని కొందరు స్థానికులు కోరారు.
● ఎస్సీ ఉపకులాల జాబితాలను సోషల్ ఆడిట్‌లో భాగంగా సచివాలయాల్లో ఇంకా ప్రదర్శించలేదని, మరింత గడువు కావాలని మాదిగ కుల సంఘాల జేఏసీ నాయకులు వినతిపత్రం ఇచ్చారు.
కలెక్టరేట్‌లో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
227 అర్జీల అందజేత
Comments
Please login to add a commentAdd a comment