కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు
● ఎస్పీ కృష్ణకాంత్
నెల్లూరు(క్రైమ్): పండగ రోజుల్లో జూదం, కోడిపందేలు, అశ్లీల నృత్యాలను నిర్వహించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ జి.కృష్ణకాంత్ ఆదేశించారు. నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఆయన సోమవారం వార్షిక నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2025 సంవత్సరంలో విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా అధిగమిస్తూ జిల్లా ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు. నేరస్తుల కదలికలపై నిఘా పెంచడంతోపాటు కార్డన్ సెర్చ్‌లు నిర్వహించాలన్నారు. సీసీ కెమెరాల ఆవశ్యకతను ప్రజలకు తెలియజేసి వాటి ఏర్పాటుకు చొరవ చూపాలన్నారు. మత్తు పదార్థాలను పూర్తిస్థాయిలో కట్టడి చేయాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పోక్సో యాక్ట్ ఫిర్యాదులపై నిర్లక్ష్యంగా ఉండొద్దన్నారు. సమావేశంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment