చర్యలు చేపడుతున్నాం | - | Sakshi
Sakshi News home page

చర్యలు చేపడుతున్నాం

Published Thu, Feb 6 2025 12:30 AM | Last Updated on Thu, Feb 6 2025 12:30 AM

చర్యలు చేపడుతున్నాం

చర్యలు చేపడుతున్నాం

జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ప్రమాదాలు చోటుచేసుకోకుండా చర్యలు చేపడుతున్నాం. నేషనల్‌ హైవేల్లో బ్లాక్‌ స్పాట్లను ఇప్పటికే గుర్తించి ఆ ప్రాంతాల్లో సూచిక బోర్డులను ఏర్పాటు చేశాం. గ్రామీణ ప్రాంతాల నుంచి హైవేపైకి వచ్చే మార్గంలో స్పీడ్‌ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని నేషనల్‌ హైవే అధికారులకు సూచించాం. రహదారి భద్రత మాసోత్సవాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. విద్యార్థులు, వాహనదారులకు విస్తృత అవగాహన కల్పిస్తున్నాం

– చందర్‌, డీటీసీ

బుజబుజనెల్లూరు సమీపంలో

గుంతలమయంగా జాతీయ రహదారి

జిల్లాలోని ప్రధాన రహదారుల్లో ఎక్కడో ఓ చోట నిత్యం మరణ మృదంగం మోగుతూనే ఉంది. డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌.. మితిమీరిన వేగం.. ఓవర్‌లోడ్‌.. నిర్లక్ష్యంగా వాహనాలను నడపడం ఓ కారణమైతే.. అస్తవ్యస్తంగా మారిన రోడ్లు మరో కారణమవుతున్నాయి. ముక్కుపిండి మరీ టోల్‌ను వసూలు చేస్తున్న కాంట్రాక్టర్లు, నేషనల్‌ హైవే అధికారులు రోడ్ల బాగును విస్మరిస్తున్నారు. వెరసి యాక్సిడెంట్లలో పదుల సంఖ్యలో మృత్యువాత పడుతుండగా, క్షతగాత్రులవుతున్న వారి సంఖ్య కోకొల్లలు. ఈ తరుణంలో రోడ్డు సేఫ్టీపై ప్రజలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రహదారి భద్రత మాసోత్సవాలను ఈ నెల 15 వరకు నిర్వహించనున్నారు.

జిల్లాలో మూడేళ్లలో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement