బడ్జెట్ ప్రతుల దహనం
నెల్లూరు(అర్బన్): కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి తీరని అన్యాయం చేశారని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. ఈ మేరకు గాంధీబొమ్మ వద్ద బడ్జెట్ ప్రతులను సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బుధవారం దహనం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నేతలు రమణయ్య, చిరసాని కోటిరెడ్డి మాట్లాడారు. వ్యవసాయానికి 2.5 శాతం నిధులను కేటాయించడం అన్యాయమని చెప్పారు. ప్రధాని ఫసల్ బీమా పథకానికి సంబంధించి ఈ ఏడాది రూ 2,500 కోట్లు తగ్గించారని తెలిపారు. కేంద్రం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని రైతులకు న్యాయం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment