![తాగి.](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/3z_mr-1738781950-0.jpg.webp?itok=Tun7n4F9)
తాగి.. తూలుతూ.. విధులకు
● నియంత్రణ కోల్పోయి.. ఆపై నిద్రలోకి..!
● హెల్త్ ఎడ్యుకేటర్ నిర్వాకం
వింజమూరు(ఉదయగిరి): రోగులకు వైద్యపరమైన సూచనలు, సలహాలను అందించి వారి సమస్యకు పరిష్కారం చూపాల్సిన హెల్త్ ఎడ్యుకేటర్ మద్యం మత్తులో నియంత్రణ కోల్పోయిన ఘటన వింజమూరు జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని చాకలికొండ పీహెచ్‌సీలో హెల్త్ ఎడ్యుకేటర్‌గా వెంకటేశ్వర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో లెప్రసీపై విద్యార్థులకు నిర్వహించాల్సిన అవగాహన కార్యక్రమానికి జిల్లా డిప్యూటీ పారామెడికల్ అఽధికారి మోహన్‌రావు హాజరయ్యారు. ఏర్పాట్లు చేయాల్సిన హెల్త్ ఎడ్యుకేటర్ పూటుగా మద్యం సేవించి ప్రాంగణానికి చేరుకున్నారు. అప్పటికే నియంత్రణ కోల్పోయిన ఆయన హెచ్‌ఎం గదిలోకి ప్రవేశించారు. అక్కడికి వెళ్లిన ఓ ఉపాధ్యాయురాలు ఆయన ప్రవర్తన చూసి భయంతో కేకలేస్తూ పరుగులు తీశారు. గమనించిన తోటి ఉపాధ్యాయులు ఆయన్ను స్కూల్ బయటకు తీసుకొచ్చి రోడ్డుపై పడేశారు. అనంతరం వైద్యశాల సిబ్బంది పక్కనే ఉన్న బీసీ హాస్టల్ అరుగుపై కూర్చోబెట్టారు. కొద్దిసేపటికి అక్కడి నుంచి కిందపడి నిద్రకు ఉపక్రమించారు. ఈ పరిణామాలను చూసిన సహచర ఉద్యోగులతో పాటు స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు. ఈ విషయమై పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ మురళీకృష్ణను సంప్రదించగా, దీనిపై జిల్లా వైద్యాధికారికి నివేదికను అందజేస్తామని బదులిచ్చారు.
![తాగి.. తూలుతూ.. విధులకు 1](https://www.sakshi.com/gallery_images/2025/02/6/05udg11-240047_mr-1738781950-1.jpg)
తాగి.. తూలుతూ.. విధులకు
![తాగి.. తూలుతూ.. విధులకు 2](https://www.sakshi.com/gallery_images/2025/02/6/05udg10-240047_mr-1738781950-2.jpg)
తాగి.. తూలుతూ.. విధులకు
Comments
Please login to add a commentAdd a comment