![గాయపడిన మాజీ ఎంపీపీ మృతి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11srp01-240042_mr-1739301538-0.jpg.webp?itok=HF4zCKSR)
గాయపడిన మాజీ ఎంపీపీ మృతి
మనుబోలు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మాజీ ఎంపీపీ అడపాల బాలచంద్రప్రతాప్ (75) మంగళవారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మను బోలు అంబేడ్కర్ నగర్‌కు చెందిన బాలచంద్ర ప్రతాప్ సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లేందుకు వైఎస్సార్ సర్కిల్ వద్ద హైవే దాటుతున్నాడు. ఆ సమయంలో నెల్లూరు నుంచి గూడూరు వైపు వెళ్తున్న ట్రక్ ఆటో వేగంగా వచ్చి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతన్ని 108 అంబులెన్స్‌లో గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
50 శాతం సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకోండి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): బీసీ సామాజిక వర్గాల్లోని కుమ్మర/శాలివాహన, మేదర కులాలకు సంబంధించిన వారు కుండలు, వెదురుబుట్టలు తయారీ చేసుకునేందుకు 50 శాతం సబ్సిడీతో కూడిన రుణాలు అందిస్తున్నామని జిల్లా వెనుకబడిన తరగతుల సేవా, సహకార సంఘం లిమిటెడ్ అధికారి డాక్టర్ నిర్మలాదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని బీసీ–ఏ గ్రూపునకు చెందిన 50 మంది లబ్ధిదారులకు రూ.1.50 కోట్లు, బీసీ–బీలో మరో 50 మందికి రూ.1.50 కోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఈ పథకానికి సంబంధించి 3 నుంచి 5 మంది గ్రూపు సభ్యులకు యూనిట్ ఖరీదు రూ.3 లక్షలుగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇందులో 50 శాతం సబ్సిడీ మిగతా 50 శాతం బ్యాంకు లోనుగా ఇవ్వడం జరుగుతుందన్నారు. అర్హులైన వారు తమ ఆధార్, రేషన్, ఆదాయ, కుల సర్టిఫికెట్లతో ఏపీఓబీఎంఎంఎస్ అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment