![రీ సర్వేను పకడ్బందీగా చేపట్టాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11srp62-240040_mr-1739301538-0.jpg.webp?itok=9-kiH45j)
రీ సర్వేను పకడ్బందీగా చేపట్టాలి
తోటపల్లిగూడూరు: భూముల రీసర్వేను పకడ్బందీగా చేపట్టాల ని జేసీ కే కార్తీక్ సూచించారు. మండలంలోని మండపం పంచాయతీలో జరుగుతున్న రీసర్వే కార్యక్రమాన్ని జేసీ కార్తీక్ మంగళవారం పరిశీలించారు. జేసీ మాట్లాడుతూ భూముల హద్దుల విషయంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఆలోచనతో ప్రభుత్వం ఈ భూసర్వే కార్యక్రమాన్ని కొనసాగిస్తుందన్నారు. రైతుల మధ్య విభేదాలు తలెత్తకుండా సరైన కొలతతో వారి భూములకు హద్దులు ఏర్పాటు చేయాలన్నారు. గతంలో జరిగిన రీ సర్వేలో దొర్లిన చిన్నపాటి తప్పిదాలను సవరించేందుకు ఈ రీసర్వే దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణప్రసాద్,డీటీ శివయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment