![పదివేల ఇంకుడు గుంతలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11nlr103-240030_mr-1739301539-0.jpg.webp?itok=i258iDC-)
పదివేల ఇంకుడు గుంతలు
● డ్వామా పీడీ గంగాభవాని
నెల్లూరు(పొగతోట): స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పది వేల ఇంకుడు గుంతలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీ గంగాభవాని అధికారులను ఆదేశించారు. మంగళవారం డ్వామా కార్యాలయం నుంచి వివిధ మండలాల ఎంపీడీఓలు, ఏపీఓలు, ఈసీలు, టీఏలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో పీడీ మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం శనివారం ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. రూ.6 వేలతో ఒక్కొక్క ఇంకుడు గుంత నిర్మాణం పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ ఇప్పటికే 7 వేల ఇంకుడు గుంతలు నిర్మించేందుకు అనుమతులు ఇచ్చారన్నారు. ఇందుకు సంబంధించి రెండు రోజుల్లోపు అనుమతుల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో లక్ష్యానికి మించి కార్యక్రమం విజయవంతం చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment