శిల్పారామం సీఈఓ ఆకస్మిక తనిఖీ
ప్రశాంతి నిలయం: స్థానిక శిల్పారామాన్ని ఏపీ శిల్పారామం సీఈఓ స్వామినాయుడు గురువారం తనిఖీ చేశారు. సందర్శకులు, సాయి భక్తులకు శిల్పారామం సద్వినియోగమవుతోందా, లేదా అనే అంశంపై ఆరా తీశారు. కన్వెన్షన్ హాల్ పనులను సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. రెస్టారెంట్ నిర్వహణను అడిగి తెలుసుకున్నారు. చేనేతల ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాల కోసం వారంలోపు స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం మరో రెండు నెలల్లో 3డీ ధియేటర్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో పుట్టపర్తి శిల్పారామం ఏఓ రమేష్‌రెడ్డి, విజయవాడ ఏఈ యశ్వంత్ , సిబ్బంది పాల్గొన్నారు.
ముగిసిన జాతీయ సదస్సు
అనంతపురం: జేఎన్‌టీయూఏ క్యాంపస్ కళాశాలలోని కంప్యూటర్ సైన్సెస్ విభాగంలో మూడు రోజులుగా జరుగుతున్న జాతీయ సదస్సు గురువారం ముగిసింది. ఆధునిక కంప్యూటింగ్ (సూపర్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అంశంపై నిర్వహించిన సదస్సు ముగింపు కార్యక్రమానికి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. సదస్సుకు హాజరైన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఇలాంటి సదస్సుల వల్ల నైపుణ్యాలు అలవడుతాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment