ప్రజల సమస్యలపై రాజీలేని పోరాటం
పెనుకొండ రూరల్: నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మేలు జరగాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ఆకాంక్షించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా, ప్రజా సమస్యలు విస్మరించినా కూటమి ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. బుధవారం ఆమె పట్టణంలోని పార్టీ కార్యాలయంలో వివిధ నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో కలిసి నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ఉషశ్రీ చరణ్ విలేకరులతో మాట్లాడారు. అలవిగాని హామీలతో గద్దెనెక్కిన కూటమి నేతలు రైతు, మహిళా, కర్షక...ఇలా అన్ని వర్గాలను మోసం చేశారన్నారు. అందువల్లే ప్రజల కోసం వైఎస్సార్ సీపీ పోరుబాట పట్టిందన్నారు.
మంత్రి అవగాహన రాహిత్యం..
బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితకు కనీస అవగాహన లేనట్లు తెలుస్తోందని ఉషశ్రీచరణ్ అన్నారు. వైఎస్సార్ సీపీ వైఫల్యాల వల్లే విద్యుత్ చార్జీలు పెంచామని మంత్రి పేర్కొనడం ఆమె అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. కనీసం గణాంకాలు కూడా తెలియని వారిని మంత్రిగా ఎలా నియమించారో అర్థం కావడం లేదన్నారు. ఎన్నికల సమయంలో విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పిన కూటమి నేతలు.. అధికారంలోకి రాగానే రూ.15 వేల కోట్ల భారం మోపారని మండిపడ్డారు. నోరుంది కదా అని మంత్రి ఏది పడితే అది మాట్లాడటం సరికాదన్నారు. ప్రజా కంటక ప్రభుత్వాన్ని ప్రజలే నిలదీసే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు.
ఉషశ్రీచరణ్‌కు శుభాకాంక్షల వెల్లువ..
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, నగర పంచాయతీ వైస్ చైర్మన్ సునీల్, వైశాలి జయశంకర్ రెడ్డి, కౌన్సిలర్లు శేషాద్రి, యాసిన్, జెడ్పీటీసీ అశోక్, పట్టణ కన్వీనర్ నరసింహులు, నాయకులు నాగళూరు బాబు, శ్రీకాంత్ రెడ్డి, దుర్గప్ప, కొండలరాయుడు, పిట్టా బాబు, చెన్నకేశవులు, నారాయణస్వామి పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీచరణ్
నూతన సంవత్సర శుభాకాంక్షలు
తెలిపేందుకు భారీగా వచ్చిన నాయకులు
Comments
Please login to add a commentAdd a comment