తెల్లనిదంతా కల్లు కాదు! | - | Sakshi
Sakshi News home page

తెల్లనిదంతా కల్లు కాదు!

Published Fri, Jan 3 2025 1:30 AM | Last Updated on Fri, Jan 3 2025 7:03 PM

టీఎఫ్

టీఎఫ్‌టీలు : 340 కల్లు గీత కార్మికుల సంఘాలు : 159 లైసెన

కల్లు ఉత్పత్తి తక్కువ.. వినియోగం ఎక్కువ

జిల్లా వ్యాప్తంగా జోరుగా కల్తీ కల్లు తయారీ

అనారోగ్యం పాలవుతున్న కల్లు ప్రియులు

ఇప్పటికే కొందరి ప్రాణాలు బలితీసుకున్న వైనం

చక్రం తిప్పుతున్న అధికార పార్టీ నాయకులు

మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ అధికారులు !

హిందూపురం/హిందూపురం అర్బన్‌: ఈత వనాలు తగ్గిపోయాయి. కానీ గ్రామాలు, పట్టణాల్లో మాత్రం కల్లుకు కొదవ లేదు. ఉన్న ఈత వనాల నుంచి సహజ సిద్ధంగా ఉన్న కల్లు 5 శాతం అవసరాలు కూడా తీర్చడం లేదు. అలాంటిది ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎటు చూసినా కల్తీ కల్లు అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. హిందూపురం, కదిరి, ధర్మవరం, మడకశిర, పెనుకొండ, తదితర నియోజకవర్గాల్లో కల్లు అమ్మకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో కల్తీ కల్లు వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇక్కడి నుంచే వివిధ మండలాలకు కల్తీ కల్లును సరఫరా చేస్తూ అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు.

రహస్య ప్రదేశాల్లో తయారీ..

రోజూ కల్లు తాగలేనిదే ఉండలేని వారు ఎంతో మంది ఉన్నారు. వారి వ్యసనాన్నే ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు కల్తీ కల్లు వ్యాపారాని తెరలేపారు. రహస్య ప్రదేశాల్లో హానికర రసాయనాలతో కల్లు తయారు చేయడం టెంపోలు, ఆటోల్లో తరలించి అమ్మకాలు చేస్తున్నారు. కల్తీ కల్లుకు అలవాటు పడ్డవారు రోజూ దాన్ని దాన్ని తాగలేక ఉండలేని పరిస్థితి తెచ్చుకొంటున్నారు. దీంతో కొంత కాలానికి ఆర్థికంగా చితికి పోవడమే కాకుండా ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రుల పాలవుతున్నారు. కొందరైతే అతిగా సేవించి ఎక్కడ పడితే అక్కడ పడి మతి స్థిమితం కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు.

కర్ణాటక నుంచే ఎక్కువ ..

కల్లు తాగేందుకు కర్ణాటక నుంచే ఎక్కువగా కల్లు ప్రియులు వస్తున్నారు. హిందూపురం, లేపాక్షి, పరిగి, చిలమత్తూరు మండలాలు కర్ణాటక సరిహద్దున ఉండటంతో కర్ణాటక నుంచి తెల్లవారకముందే కల్లు కోసం వచ్చి సేవించి వెళ్తుంటారు.

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం..

ఆరోగ్యాలపై ప్రమాదకర ప్రభావం చూపించే డైజోఫాం, క్లోరో హైడ్రేడ్‌, శాక్రిన్‌, అమ్మోనియం తదితర రసాయనిక మందులను కల్లులో కలిపి అమ్మకాలు చేస్తున్నారు. కల్తీ చేసిన కల్లు తాగిన రెండు నిమిషాల్లో నిషా నాశలానికి ఎక్కేవిధంగా చేస్తున్నారు. దీనికి అలవాటుపడిన కల్లు ప్రియులు దాన్ని విడిచిపెట్టలేక కల్లుకు బానిసలుగా మారి క్రమంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కల్తీ కల్లు తాగితే ఆలోచనశక్తి కోల్పోయి మతిమరుపు అధికమై కాలేయం దెబ్బతిని ప్రాణం మీదకు వచ్చే ప్రమాదం ఉందని వైదులు హెచ్చరిస్తున్నారు.

నాయకుల అండదండలతో..

కల్లు విక్రయ దుకాణాలకు సరైన అనుమతులు లేకపోయినా అధికార పార్టీ నాయకుల అండదండలతో కల్తీ కల్లు వ్యాపారం జోరుగా సాగుతోందన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. వాస్తవంగా హిందూపురం పట్టణంలో 10 దుకాణాలకు అనుమతులు ఉండగా సుమారు 35 వరకూ దుకాణాలను నిర్వహిస్తున్నారు. అలాగే హిందూపురం మండలంలో ఐదింటికి అనుమతి ఉండగా సుమారు 24 దుకాణాల్లో కల్లు విక్రయాలు చేస్తున్నారు. అలాగే చిలమత్తూరు, లేపాక్షి, పరిగి మండలాల్లో కూడా అనుమతులను మించి దుకాణాలు ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తున్నారు.

మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు

కల్తీ కల్లును అరికట్టాల్సిన ఎక్సైజ్ అధికారులు నెలవారీ మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న విమర్శలున్నాయి. కేవలం ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రం హడావుడి చేస్తూ ఆ తర్వాత మామూళ్లు తీసుకుంటూ అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారని చెబుతున్నారు. కేవలం రికార్డుల నిర్వహణలో భాగంగా తనిఖీలకు వెళ్లినా ముందస్తుగా వ్యాపారులకు సమాచారం వెళ్లిపోతుండటంతో అక్రమార్కులు అలర్ట్‌ అయిపోతున్నారు. కేవలం శాంపిళ్లు సేకరించి చిత్తూరు ల్యాబ్‌కు పంపడం మినహా ఎక్సైజ్ సిబ్బంది చేసిందేమీ లేదన్న విమర్శలున్నాయి.

ఉమ్మడి ‘అనంత’ జిల్లాలో అనుమతులు ఇలా..

టీఎఫ్‌టీలు : 340 కల్లు గీత కార్మికుల సంఘాలు : 159 లైసెన్స్‌ కల్లు దుకాణాలు : 495

కఠిన చర్యలు తీసుకుంటాం

జిల్లా వ్యాప్తంగా ఉన్న కల్లు దుకాణాలను ఎక్సైజ్‌ సిబ్బంది ఆధ్వర్యంలో తనిఖీ చేస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కల్లు దుకాణాల్లో శాంపిళ్లు సేకరిస్తున్నాం. వాటిని చిత్తూరు ల్యాబ్‌కు పంపుతున్నాం. కల్తీ కల్లు అని తేలితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఉపేక్షించేది లేదు. కల్లు దుకాణదారులు నాణ్యమైన కల్లునే విక్రయించాలి.

– గోవిందనాయక్‌, ఎక్సైజ్ సూపరింటెండెంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
టీఎఫ్‌టీలు : 340 కల్లు గీత కార్మికుల సంఘాలు : 159 లైసెన1
1/2

టీఎఫ్‌టీలు : 340 కల్లు గీత కార్మికుల సంఘాలు : 159 లైసెన

టీఎఫ్‌టీలు : 340 కల్లు గీత కార్మికుల సంఘాలు : 159 లైసెన2
2/2

టీఎఫ్‌టీలు : 340 కల్లు గీత కార్మికుల సంఘాలు : 159 లైసెన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement