దాడులు ఆపకపోతే ఉద్యమిస్తాం
హిందూపురం: ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులపై వరుసగా దాడులు చేస్తున్నారు. దీనికితోడు అక్రమ కేసు కూడా బనాయిస్తున్నారు. దాడులు ఆపకపోతే ఉద్యమానికి శ్రీకారం చుడతాం. వైస్సార్‌సీపీ శ్రేణులు అధైర్యపడాల్సిన పనిలేదు. సమష్టిగా పార్టీ కోసం పనిచేయాలి. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది.’ అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు. హిందూపురం సబ్ జైలులో ఉన్న ముగ్గురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను హిందూపురం వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ నాయకుడు గుడ్డంపల్లి వేణురెడ్డి, నాయకులతో కలసి ఉషశ్రీచరణ్ గురువారం పరామర్శించారు. అనంతరం ఉషశ్రీచరణ్ మీడియాతో మాట్లాడుతూ హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు మండలం పెద్దనపల్లిలో వెంకటరమణప్ప, మచ్చేంద్రప్ప,శివప్ప వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తుమని చెప్పారు. గ్రామంలో వారందరూ సౌమ్యంగా ఉండేవారేనని, అనవసరంగా చిలమత్తూరు టీడీపీ మండల కన్వీనర్ రంగారెడ్డి దాడి చేయడమే కాకుండా అధికార దర్పంతో వారిపై తప్పడు కేసులు నమోదు చేయించి అరెస్టు చేయించడం దారుణమన్నారు. ఎన్నికల కౌంటింగ్ రోజు బూత్ వద్దకే వచ్చి వైఎస్సార్‌సీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారని, ఇందులో భాగంగానే కేసులు నమోదు చేయించి జైళ్లలో పెట్టించారని విమర్శించారు. కక్ష సాధింపులు, రాజకీయ విద్వేషాలకు పాల్పడుతూ వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులను టార్గెట్‌గా చేసుకుని వివక్ష పూరిత రాజకీయాలు చేస్తున్నారన్నారు. అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదని గ్రహించాలన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలని సూచించారు. గతంలో తాము అధికారంలో ఉన్నా ఎవరిపై తప్పుడు కేసులు పెట్టలేదన్నారు. అలాంటి వాటిని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడూ ప్రోత్సహించలేదన్నారు. వివక్ష చూపకుండా, కుల,మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తూ రాష్ట్రంలో ఎటూ చూసినా అరాచకాలు సృష్టిస్తోందన్నారు. సోషల్ మీడియా ప్రతినిధులు ప్రశ్నించినా దాడులు, కేసులు నమోదుచేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. రొద్దం మండలంలో కూడా వైఎస్సార్‌సీపీ నాయకుడు బాలాజీపై కేసులు పెట్టారని చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారందరూ జైళ్లకు పోవాల్సిందేనా? అని ప్రశ్నించారు.
పవన్‌కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు?..
కూటమి ప్రభుత్వ పాలనలో దాడులు జరుగుతున్నా, తప్పుడు కేసులు పెడుతున్నా డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. శాంతి కోసం పాటు పడతానని, దాడులు, దౌర్జన్యాలకు దూరంగా ఉంటామని, రకరకాలుగా పలికే పవన్ కళ్యాణ్ ఇప్పుడేం చేస్తున్నారో చెప్పాలన్నారు. ఇప్పటికై నా వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులను ఆపకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ‘హిందూపురం కొల్లకుంటలో దాడి చేశారు. చిలమత్తూరు ఫ్యాక్టరీ వద్ద మహిళలపై అత్యాచారాలు జరిగాయి. ఇప్పుడు బీసీలపై దాడిచేసి తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారు. వారి నాయకులు, కార్యకర్తలను నియంత్రించకుండా ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాంటి వాటిని ప్రోత్సహించాడన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజా సమస్యలు విస్మరించి, కక్షసాధింపు చర్యలకు పాల్పడితే కూటమి ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కురుబ కార్పోరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్‌ఏ శివ, మండల కన్వీనర్ రాము, జిల్లా మహిళా అధ్యక్షురాలు నాగమణి, వాణిజ్య విభాగం అధ్యక్షుడు మహేష్‌గౌడ్, ధనుంజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కూటమి పాలనలో వైఎస్సార్‌సీపీ
శ్రేణులపై వరుస దాడులు
పవన్‌కళ్యాణ్ ఎందుకు
స్పందించడం లేదు?
వైఎస్సార్‌సీపీ జిల్లా అఽధ్యక్షురాలు ఉషశ్రీచరణ్
Comments
Please login to add a commentAdd a comment