వజ్రకరూరు: మండలంలోని పీసీ.ప్యాపిలి తండాకు ఆదినారాయణ నాయక్‌ను పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు వజ్రకరూరు ఎస్‌ఐ నాగస్వామి తెలిపారు. వివరాలను గురువారం ఆయన వెల్లడించారు. మూడు రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను ఆదినారాయణ నాయక్ తన వెంట పిలుచుకుని వెళ్లాడు. ఘటనపై బాలిక తల్లి ఫిర్యాదు మేరకు డీఎస్పీ శ్రీనివాస్ విచారణ చేపట్టారు. గురువారం మధ్యాహ్నం పీసీ ప్యాపిలి బస్టాఫ్ వద్ద బస్సు కోసం వేచి ఉన్న ఆదినారాయణనాయక్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment