తాత్కాలిక సీనియార్టీ జాబితా సిద్ధం
అనంతపురం ఎడ్యుకేషన్: అనంతపురం ముని సిపల్ కార్పొరేషన్, ఉమ్మడి జిల్లాలోని మునిసిపాలిటీల పరిధిలోని పాఠశాలలకు సంబం ధించి పీఎస్ హెచ్‌ఎం, తెలుగు, హిందీ, ఉర్దూ స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించేందుకు తాత్కాలిక సీనియార్టీ జాబితా సిద్ధం చేశారు. https:// deoananthapuramu.blog spot.com వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు డీఈఓ ఎం.ప్రసాద్‌బాబు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జాబితాను పరిశీలించి ఏవైనా అభ్యంతరాలుంటే శుక్రవారం సాయంత్రం 5 గంటలలోపు సరైన ఆధారాలతో హెచ్‌ఎం, ఎంఈఓల ద్వారా డీఈఓ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
8న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు ఈ నెల 8న నిర్వహించనున్నట్లు జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈఓ) ఆర్. రామచంద్రారెడ్డి గురువారం తెలిపారు. జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ సహా ఆయా స్థాయీ సంఘాల అధ్యక్షుల అధ్యక్షతన స్థాయీ సంఘం–1, 2, 3, 4, 5, 6, 7(ఆర్థిక/ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి/ వ్యవసాయం/ విద్య, వైద్యం/మహిళా శిశు, సంక్షేమం/సాంఘిక సంక్షేమం/ఇంజినీరింగ్ శాఖలు) సమావేశాలు నిర్వహించనున్నట్లు వివరించారు. గత సమావేశాల్లో సభ్యులు లేవనెత్తిన అంశాలకు సంబంధించి తీసుకున్న చర్యలు, ఇప్పుడు జరగబోయే సమావేశాల్లో సభ్యులు అడిగే సమస్యలకు సంబంధించి సమగ్ర సమాచారంతో అన్ని శాఖల అధికారులు హాజరుకావాలని ఆదేశించారు. ఎవరైనా గైర్హాజరైతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
5న పెనుకొండకు
కేంద్ర రైల్వే మంత్రి రాక !
పెనుకొండ: కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సోమణ్ణ 5వ తేదీన పెనుకొండకు రానున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. పెనుకొండ రైల్వే బ్రిడ్జిని రూ. 25 కోట్లతో నిర్మించారు. బ్రిడ్జిని ప్రారంభించేందుకు కేంద్ర మంత్రి వస్తున్నట్లు చెబుతున్నారు. 2019లో బ్రిడ్జి మంజూరైంది. పనులు ఆలస్యం కావడంతో ఇప్పటికి పూర్తయింది. ఈ నేపథ్యంలోనే రైల్వేమంత్రి బ్రిడ్జిని ప్రారంభించనున్నారు.
స్కౌట్ అండ్ గైడ్ టీచర్లకు శిక్షణ
పరిగి: దేశ సేవలో ప్రతి ఒక్కరూ తరించాలని ఎంఈఓ లక్ష్మీదేవి తెలిపారు. మండలంలోని కొడిగెనహళ్లిలో ఏపీ స్కూల్ ఆఫ్ రెసిడెన్షియల్ ఎక్సలెన్స్ పాఠశాలలో గురువారం జిల్లా స్థాయి స్కౌట్ అండ్ గైడ్స్‌పై ప్రత్యేక శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఇటీవల పీఎంశ్రీ పాఠశాలలుగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన పాఠశాలల్లో స్కౌట్ అండ్ గైడ్స్‌పై జిల్లాలోని 27 పాఠశాలల స్కౌట్ అండ్ గైడ్ టీచర్లకు వారం రోజుల పాటూ బేసిక్ శిక్షణా తరగతులను ఏపీఆర్‌ఎస్ కొడిగెనహళ్లిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు దేశ భక్తి భావాన్ని పెంపొందించడంతో పాటూ సమాజ సేవపై అవగాహన కల్పించడానికి చేపట్టాల్సిన కృత్యాలను శిక్షణా కార్యక్రమాల ద్వారా వివరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్కౌట్ అండ్ గేమ్స్ ట్యాగ్‌లను ముఖ్య అతిథులకు అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మురళీధర్‌బాబు, జిల్లా స్కౌట్ సెక్రెటరీ గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.
స్టాఫ్ నర్సు ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
పుట్టపర్తి అర్బన్: వైద్య ఆరోగ్యశాఖ కడప జోన్–4 పరిధిలోని స్టాఫ్ నర్సు ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ బి.రామగిడ్డయ్య, డీఎంహెచ్‌ఓ ఫైరోజ్‌బేగం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రీజియన్ పరిధిలో 150 కాంట్రాక్ట్ స్టాఫ్‌నర్సు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. దరఖాస్తు నమూనా ఇతర వివరాలను https.cfw.ap.gov.in వెబ్‌సైట్‌లో ఉందన్నారు. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని భర్తీ చేసి జనవరి 17వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు కడపలోని ప్రాంతీయ సంచాలకులు, వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment