జిల్లాను ప్రగతిపథంలో నడిపిద్దాం
ప్రశాంతి నిలయం: కలెక్టర్ టీఎస్ చేతన్‌కు ఎస్పీ రత్న, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పుష్పగుచ్ఛాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గురువారం కలెక్టర్‌ను ఆయన చాంబర్‌లో కలసి వారు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డీఆర్‌ఓ విజయ సారధి, జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్ల ఆర్‌డీఓలు, తహసీల్దార్లు, ఇతర అధికారులు కలెక్టర్‌లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు అన్ని ప్రభుత్వశాఖల అధికారులు సమష్టిగా కృషి చేయాలన్నారు.
మెరుగైన సేవలు అందిద్దాం
పుట్టపర్తి టౌన్: కొత్త సంవత్సరంలో సమష్టిగా.. మరింత ఉత్సాహంతో ప్రజలు మెరుగైన సేవలు అందిద్దామని ఎస్పీ రత్న అధికారులకు సూచించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గురువారం పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రత్న ఆధ్వర్యంలో డీపీఓ సిబ్బంది నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రత్న సిబ్బందితో కలసి కేక్ కట్ చేశారు. జిల్లా క్యాంప్ కార్యాలయం అధికారులు, స్పెషల్ బ్రాంచ్, డీపీఓ సిబ్బంది, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు సబ్ డివిజన్ల వారీగా పోలీస్ కార్యాలయానికి విచ్చేసి ఎస్పీని మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్పీ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. పోలీసుల ప్రతిష్టను పెంచే విధంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, డీఎస్పీలు విజయకుమార్, శివన్నారాయణస్వామి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, ఎస్‌బీ సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్, సీసీ రాఘవేంద్ర, సూపరింటెండెంట్ సరస్వతి, ఆర్‌ఐలు వలి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment