వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ‘పచ్చమూక’ దాడి
● కేసు నమోదు చేయని బత్తలపల్లి ఎస్‌ఐ
బత్తలపల్లి: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి బత్తలపల్లిలో చోటుచేసుకుంది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా బత్తలపల్లి కూడలిలో టీడీపీ వర్గీయులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. అర్ధరాత్రి సమయంలో టీడీపీ వర్గీయులు కేక్ కట్ చేసి ‘జై పరిటాల’ అంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కూడా కేక్ కట్ చేసి ‘జై జగన్’ అంటూ నినాదాలు చేశారు. ఇది విన్న టీడీపీ వర్గీయులు రెచ్చిపోయారు. ‘ఏరా మా ముందే జై జగన్’ అంటూ నినాదాలు చేస్తారా... అంటూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు గవ్వల రమేష్, ముసుగు అప్పస్వామి, కొంకా ప్రసాద్‌లపై దాడులకు పాల్పడ్డారు. ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న స్థానికుడు లోకేష్ నాయుడు ఇరువర్గాల వారికి సర్దిచెప్పేందుకు వెళ్లగా... ఆయనపైనా దాడి చేశారు. ఈ ఘటనలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు నలుగురూ గాయపడ్డారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎస్‌ఐ సోమశేఖర్ ఇరువర్గాల వారికి సర్దిచెప్పి పంపారు. బుధవారం బాధితులు వైఎస్సార్ సీపీ మండల ఉపాధ్యక్షుడు కోటి సురేష్‌తో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా, కేసు నమోదు చేసుకోకపోవడం గమనార్హం.
వైకల్య ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి
పుట్టపర్తి అర్బన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు సంబంధించి అంగవైకల్య ధ్రువీకరణ పత్రాలను ఈనెల 4వ తేదీలోపు కొత్తచెరువులోని డీఈఓ కార్యాలయంలో అందజేయాలని డీఈఓ కృష్ణప్ప ఓ ప్రకటనలో సూచించారు. పదో తరగతి రెగ్యులర్ విద్యార్థులతో పాటు పరీక్ష తప్పిన వారికి సంబంధించిన పత్రాలను ఇదివరకే ఆన్‌లైన్‌లో పొందుపరిచారని, అందులో పీహెచ్‌గా ఎవరైనా నమోదు చేసి ఉంటే ఆ ధ్రువీకరణ పత్రాలను డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని జిల్లాలోని అన్ని యాజమాన్యాల కింద పనిచేసే ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచించారు. వాటిని ధ్రువీకరించిన అనంతరం ఒరిజినల్ పత్రాలను తిరిగి తీసుకు వెళ్లవచ్చన్నారు.
డివిజన్‌ను అభివృద్ధి
పథంలో నడుపుతా
● నూతన డీఆర్‌ఎం సీఎస్ గుప్తా
గుంతకల్లు: అందరి సహకారంతో గుంతకల్లు రైల్వే డివిజన్‌ను అభి వృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తానని నూతన డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్తా పేర్కొన్నారు. గుంతకల్లు రైల్వే డివి జనల్ మేనేజర్‌గా బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏడీఆర్‌ఎం సుధాకర్, సీనియర్ డీసీఎం మనోజ్, సీనియర్ డీపీఓ క్యాప్రిల్ ఆరోరా, ఇతర విభాగాల అధికారులు మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి నూతన సంవత్సర శుభాంకాక్షలు తెలిపారు. అదేవిధంగా రైల్వేకార్మిక సంఘాల నాయకులు శాలువాతో సన్మానించి స్వాగతం పలికారు. అనంతరం వివిధ విభాగాల అధికారులతో డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్తా సమావేశమయ్యారు. డివిజన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ప్రయాణికుల భద్రతకు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment