కోర్టు ప్రాంగణంలో న్యూ ఇయర్ వేడుకలు
పుట్టపర్తి రూరల్: బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం పుట్టపర్తిలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జూనియర్ సివిల్ జడ్జి రాకేష్ కేక్ కట్ చేశారు. నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కత్తి గంగిరెడ్డి, న్యాయవాదులు నాగమల్లేశ్వర్‌రెడ్డి, నిడిమామిడి శ్రీనివాసులు, రాజేంద్ర ప్రసాద్‌రెడ్డి, లెక్కల యదుభూషణ్, అతావూర్ రహిమాన్, హరికృష్ణ, చల్లా రాజశేఖర్ కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో
‘నూతన’ వేడుకలు
ప్రశాంతి నిలయం: నూతన సంవత్సర వేడుకలు బుధవారం కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు శాఖాధిపతులతో కలసి వెళ్లి కలెక్టర్‌ను ఆయన ఛాంబర్‌లో కలసి పూల బొకేలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నూతన సంవత్సరంలో జిల్లాను అన్ని రంగాలలో ప్రగతి బాటలో నడిపేందుకు ఉద్యోగులు కృషి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వారి పరిధిలో ప్రజలకు నాణ్యమైన సేవలను అందించాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతా లక్ష్యాలను సాధించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగాలని సూచించారు. అనంతరం ఆయన జిల్లా ప్రజలకు, ప్రభుత్వ యంత్రాంగానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment