సబ్‌స్టేషన్‌ను ప్రారంభించిన మంత్రి సవిత
గోరంట్ల: మండలంలోని బూదిలి గ్రామ పంచాయతీ పరిధిలోని గొల్లపల్లి సమీపంలో దాదాపు రూ.90 కోట్ల వ్యయంతో ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో నిర్మించిన 220 కేవీ సబ్‌స్టేషన్‌ను గురువారం బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ప్రాంభించారు. గోరంట్ల ,చిలమత్తురు, పాలసముద్రం సమీపంలో ఏర్పాటైన పరిశ్రమలకు విద్యుత్ లోఓల్టేజీ సమస్య పరిష్కారం కోసం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయంలో గొల్లపల్లి సమీపంలో 220 సబ్‌స్టేషన్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారు. పనులు సైతం ఏడాది క్రితం పూర్తయ్యాయి. గురువారం మంత్రి సవిత సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో హిందూపురం ఎంపీ పార్థసారథి, కలెక్టర్ టీఎస్ చేతన్, పుట్టపర్తి ఆర్‌డీఓ సువర్ణ, ట్రాన్స్‌కో ఎస్‌ఈ వరప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.
ఐటీఐ ఉత్తీర్ణులైన వారికి అప్రెంటిస్‌షిప్
పుట్టపర్తి టౌన్: వివిధ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీరునలైన వారికి ఆర్టీసీలో అప్రింటిస్‌షిప్ చేసే అవకాశం కల్పిస్తున్నట్లు కర్నూలు శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్ నజీర్ అహ్మద్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో డీజల్ మెకానిక్ 28, మోటర్ మెకానిక్–3 ఎలక్ట్రీషియన్ – 3, ఫిట్టర్–1, డ్రాఫ్ట్‌మెన్ సివిల్ –1, పెయింటర్ ట్రేడ్ –1 మెత్తం 37 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 19 నుంచి www.apprenticeshipindia.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. పూర్తి సమాచారం కోసం 7382869399, 7382873146 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
బావపై హత్యాయత్నం
● పరిటాల శ్రీరామ్ అనుచరుల దౌర్జన్యం
సోమందేపల్లి: మండల కేంద్రంలోని మారుతీనగర్‌కు చెందిన వడ్డె దినేష్‌పై బావ మరుదులు రవి, గణపతి మారణాయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుధవారం అర్ధరాత్రి తన ఇంటిలో నిద్రిస్తుండగా రామగిరి మండలం వెంకటాపురానికి చెందిన కొందరు రెండు వాహనాల్లో వచ్చి తనపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. కొన్నేళ్ల క్రితం వెంకటాపురంలో తాను వివాహం చేసుకున్నట్లు చెప్పారు. ఆస్తికి సంబంధించి గొడవల్లో భాగంగా తన భార్య అలివేలమ్మ తన అమ్మ సుంకమ్మతో రెండు క్రితం గొడవ పడిందన్నారు. ఇద్దరికీ సర్ది చెప్పగా భార్య అలివేలమ్మ తన సోదరులు రవి, గణపతికి చెప్పడంతో వాళ్లు మరి కొందరితోఓ కలసి వచ్చి దాడి చేశారన్నారు. ఇప్పటికే రెండు సార్లు వాళ్లు దాడి చేశారని చెప్పారు. పరిటాల శ్రీరామ్ సొంతూరు కావడం, వాళ్ల దగ్గరే పనిచేస్తుండడంతో వారి అండతోనే తమపై దాడి చేసినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. వారి నుంచి రక్షణ కల్పించాలని ఎస్‌ఐ రమేష్ బాబును కోరారు.
నియామక పత్రాల అందజేత
పుట్టపర్తి: జిల్లాలోని కేజీబీవీల్లో పోస్టింగ్ దక్కించుకున్న 55 మంది ఉపాధ్యాయులకు డీఈఓ కిష్టప్ప గురువారం నియామక పత్రాలు అందజేశారు. బుక్కపట్నంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో ఇందుకు సంబంధించి 1ః5 నిష్పత్తిలో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. 70 మంది హాజరు కాగా, 55 మంది అర్హత సాధించారు. మిగిలిన 15 పోస్టులకు సంబంధించి త్వరలో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు చేపట్టి ఎంపిక చేయనున్నట్లు డీఈఓ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment