సోషల్ మీడియా కార్యకర్త ఇంట్లో సోదాలు
కదిరి అర్బన్: ఉగ్రవాదులు, నక్సలైట్ల ఇళ్లలో సోదాలు చేసినట్లు వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్త ఇంట్లో పోలీసులు గురువారం సోదాలు చేశారు. కదిరి మండలం వీరచిన్నయ్యగారిపల్లికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త అమరనాథ్‌రెడ్డి ఇంట్లో రూరల్ మండల పోలీసులు సోదాలు నిర్వహించారు. తన కుమారుడిని పోలీసులు తీసుకెళ్లి ఇంతవరకు విడిచిపెట్టలేదని అమరనాథ్‌రెడ్డి తండ్రి గంగిరెడ్డి (పెరాలసిస్ పేషంట్) కుమారుడిని వెతుక్కుంటూ ఇంటికి తాళం కూడా వేయకుండా కదిరికి వచ్చాడు. ఈ నేపథ్యంలో నలుగురు పోలీసులు అమరనాథ్‌రెడ్డిని ఇంట్లో మొత్తం సోదాలు నిర్వహించారు. అయితే వారికి ఏమీ దొరకలేదు. బీరువా తాళం వేసి ఉండడంతో ఆ తాళం గంగిరెడ్డి వద్ద ఉండటంతో బీరువా చెక్ చేయాలని ఇంట్లోకి ఎవరూ ప్రవేశించకుండా పోలీసులు తాళం వేశారు. గంగిరెడ్డి కదిరి నుంచి వచ్చాక బీరువా చెక్ చేసి తాళం ఇస్తామని పోలీసులు చెప్పినట్లు తెలిసింది. అమర్‌నాథ్‌రెడ్డి కుటుంబం ఏమైనా ఉగ్రవాది కుటుంబమా? కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా పోస్టులు పెడితే ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అని స్థానికులు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment