‘దీపం’ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి
ప్రశాంతి నిలయం: జిల్లాలో అర్హులందరూ దీపం పథకం ద్వారా లబ్ధి పొందాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌హాల్‌లో పౌరసరఫరాల అధికారులతో జేసీ సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తెల్లరేషన్ కార్డు కలిగి ఆధార్‌తో అనుసంధానం చేసుకున్న వినియోదారులకు ప్రతి ఆర్థిక సంవత్సరానికి మూడు ఉచిత ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలో 5,72,517 గ్యాస్ కనెక్షన్లకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. దీపం–2 పథకం సక్రమంగా అమలు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారులు మొదట రుసుము చెల్లిస్తే 48 గంటల్లో తిరిగి ప్రభుత్వం వారి ఖాతాల్లోకి నగదు జమ చేస్తుందన్నారు. తెల్లరేషన్ కార్డు కలిగి గ్యాస్ కనెక్షన్ క్రియా క్రియాశీలకంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చన్నారు. గ్యాస్ కనెక్షన్ పొందే క్రమంలో ఏవైనా సందేహాలు ఉంటే కలెక్టర్ కార్యాలయంలో పౌరసరఫరాలశాఖ కార్యాలయంలో పౌరసరఫరాలశాఖ అధికారిని సంప్రదించవచ్చని పేర్కొన్నారు. సమావేశంలో డీఎస్‌ఓ వంశీకృష్ణారెడ్డి, ప్రశాంతి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు రాజీవ్‌దేవ్ తదితరులు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment