తలుపుల: మండల కేంద్రంలోని ఎగువపేట సమీపంలో ఉన్న పీతురుకుంట కల్వర్టులో శుక్రవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ నాగేంద్ర, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి చేతిపై తెలుగులో అంజి, ఇంగ్లిష్‌లో ఉమ అనే పచ్చబొట్టు ఉంది. ముఖం కనిపించికుండా నుజ్జు నుజ్జు అయి ఉండడంతో హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలాన్ని డీఎస్పీ శివనారాయణస్వామి పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తి హత్య కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment