‘పురం’లో మాయమవుతున్న పిల్లులు
హిందూపురం: పట్టణంలోని మేళాపురంలో గత కొన్ని రోజులుగా పెంపుడు పిల్లులు మాయమవుతున్నాయి. తొలుత ఒకరిద్దరి ఇళ్లలో పిల్లులు మాయమైనా... ఆ తర్వాత వరుసగా ఇలాంటి ఘటనలే వెలుగు చూస్తుండడంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. దీంతో మేళాపురం పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ క్రమంలో మేళాపురం సర్కిల్‌లోని భారతీనగర్ చెరువు కట్ట వద్ద గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న సంచార జాతుల వారిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. రోజూ దేవుడి ప్రతిమను నెత్తిన పెట్టుకుని కాలనీల్లో సంచరిస్తూ డబ్బు, బియ్యం, బ్యాళ్లు సేకరించుకునే వీరు... ఇళ్ల వద్ద గమనిస్తూ ఎవరూ లేని సమయంలో పెంపుడు పిల్లుల మెడకు ఉచ్చు వేసి తీసుకెళుతున్నారని, అనంతరం వాటిని చంపి తింటున్నారంటూ శుక్రవారం ఉదయం వన్‌టౌన్ సీఐ రాజగోపాలనాయుడుకు ఫిర్యాదు చేశారు. సంచార జాతుల వారిని కట్టడి చేయాలని విన్నవించారు. దీనిపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
కొన్ని రోజులుగా కనిపించకుండా పోతున్న పెంపుడు పిల్లులు
అయోమయంలో
మేళాపురం వాసులు
పిల్లులను పట్టుకెళ్లి చంపి తింటున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు
సంచార జాతుల వారిని
కట్టడి చేయాలంటూ వినతి
Comments
Please login to add a commentAdd a comment