జూదరుల అరెస్ట్
గుడిబండ: మండలంలోని ఆచారిపాళ్యం గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అందిన విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం ఉదయం మడకశిర రూరల్ సీఐ రాజకుమార్, సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో పేకాట ఆడుతున్న వారు పోలీసులను గమనించి పారిపోయారు. వీరిలో ఆరుగురిని పోలీసులు వెంటాడి అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ఐదుగురు పరారయ్యారు. పట్టుబడిన వారి నుంచి రూ.52,200 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
● నల్లచెరువు: మండలంలోని నడింపల్లి వద్ద జూదం ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు నల్లచెరువు ఎస్‌ఐ మక్బూల్‌బాషా తెలిపారు. అందిన సమాచారం మేరకు శుక్రవారం ఉదయం నడింపల్లి శివారు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో పేకాట ఆడుతున్న ఆరుగురు పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.6,180 నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment