ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ శిబిరానికి ఎంపిక
అనంతపురం: జేఎన్‌టీయూఏ క్యాంపస్ కళాశాలలో ఈసీఈ మూడో సంవత్సరం చదువుతున్న ఎస్.వెంకటేష్‌నాయక్, ఓటీపీఆర్‌ఐలో ఎమ్మెస్సీ ఫుడ్‌టెక్నాలజీ చదువుతున్న జి. నందిత న్యూఢిల్లీలో జరిగే ప్రీ రిప్లబిక్ డే పరేడ్ శిబిరానికి ఎంపికయ్యారు. జలగావ్‌లోని కవయిత్రి బహినాబాయి చౌదరి నార్త్ మహారాష్ట్ర యూనివర్సిటీ వేదికగా ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు జరిగే క్యాంప్‌లో వీరు ప్రత్యేక శిక్షణ పొందనున్నారు. ఎంపికై న విద్యార్థులను జేఎన్‌టీయూఏ ఇన్‌చార్జ్ వీసీ ఆచార్య హెచ్.సుదర్శనరావు, రిజిస్ట్రార్ ఎస్.కృష్ణయ్య, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ శారద అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment