శ్రీకాకుళం క్రైమ్ : ఔషధ చట్ట నిబంధనలు అతిక్రమించి నాసిరకం మందులను తయారుచేస్తున్న యాజమాన్యానికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ శ్రీకాకుళం అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కె.ఎం.జామృత్‌బేగం మంగళళవారం తీర్పు వెలువరించినట్లు డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రరావు పేర్కొన్నారు. 2017 అక్టోబరు 30న నగరంలోని హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఎతిక్స్ హెల్త్ కేర్ కంపెనీకి అప్పటి శ్రీకాకుళం డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఎ.కృష్ణ తనిఖీలకు వెళ్లారు. ఆర్బిజ్–2డి (రేబిప్రజోల్ ఐపీ) ట్యాబ్లెట్లను విశ్లేషణ నిమిత్తం ల్యాబ్‌కు నమూనాలు పంపగా కొన్ని ప్రామాణికాలు లోపించినట్లు గుర్తించారు. యజమానులైన ఎం.డానియల్, ఎస్.జయరాజ్‌లపైనే కాకుండా కంపెనీపైన కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుత డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఎన్.యుగంధర్, ఏడీ చంద్రరావులు కేసు నడిపించగా సీనియర్ ఏపీపీ పి.సుశీల వాదనలు వినిపించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన మెజిస్ట్రేట్ మంగళవారం యజమానులు ఇద్దరు, కంపెనీకి రూ. 25 వేలు చొప్పున మొత్తం రూ.75 వేలు జరిమానా, ఒకరోజు జైలు శిక్ష విధించినట్లు ఏడీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment