తడిసిన ధాన్యం
పండిన పంట అమ్ముకోలేక వర్షానికి తడిచిపోయి, మొలకెత్తిన ధాన్యం చూపిస్తున్న నరసన్నపేట రైతు గోడు ఇది. తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షానికి ఎండబెట్టిన ధాన్యం మొలకెత్తడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు ధాన్యం తడిచి ముద్దవడంతో ఇలాంటి రైతులు తేరుకోలేకపోతున్నారు.
వజ్రపుకొత్తూరు మండలంలో బెండి గ్రామానికి చెందిన ఈ రైతు పరిస్థితి చూడండి. గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు కోసిన వరి పంట నీట మునిగింది. పొలంలోకి భారీగా నీరు చేరింది. అప్పటికే చేను పూర్తిగా తడిచిపోయింది. ఇప్పుడా పొలంలోని వర్షపు నీరును బయటికి తోడుతున్నారు. చేతికందిన పంట వర్షార్పణం కావడంతో ఆ రైతు చెందుతున్న ఆందోళన అంతా ఇంతా కాదు.
● సకాలంలో ధాన్యం కొనుగోలు చేయని కూటమి ప్రభుత్వం
● ఫెంగల్ ప్రభావంతో తడిచిన ధాన్యం
● జిల్లా వ్యాప్తంగా అన్నదాతకు తీవ్ర నష్టం
Comments
Please login to add a commentAdd a comment