వదలని వాన
శ్రీకాకుళం పాత బస్టాండ్:
జిల్లాను ముసురు వదలడం లేదు. గడిచిన రెండు రోజులు కంటే శుక్రవారం వర్షాలు పెరిగాయి. జిల్లావ్యాప్తంగా 540 మిల్లీమీటర్ల వాన పడింది. వాతావరణం పూర్తిగా చల్లబడడంతో చలి తీవ్రత కూ డా పెరిగింది. మరో 24 గంటలు ఇదే వాతావరణం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ముసురు పట్టినట్టు వాన ఏకధాటిగా పడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కువగా వరి పంట కుప్పలతో పొలాల్లో ఉండిపోవటం, కురుస్తున్న వర్షాలకు కుప్పల కిందకి వర్షపు నీరు వెళ్లడంతో పంట పాడవుతుందని భయపడుతున్నారు. అలాగే వరి కుప్పలు పైనుంచి వర్షం పడడంతో కుప్పలు నానిపోతున్నాయని, వరి గింజ మొక్కలు మొలిచే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం రైతులకు గోనె సంచులు ఇవ్వకపోవడం, సరైన గోదాము సదుపాయాలు కల్పించకపోవడంతో ఇబ్బందులు ఎదురైనట్లు పేర్కొన్నారు.
వాన పడుతుందని తెలిసినా..
తుఫాన్‌పై వాతావరణ శాఖ ఎప్పటి నుంచో హెచ్చరిస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం రైతులను ఆదు కునేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు వేగవంతం చేసే ప్రయత్నాలేవీ కనిపించలేదు. దీంతో నూర్చిన పంట కూడా పొలాల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. 5 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలుకు లక్ష్యం పెట్టుకోగా.. 2,36,000 మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారు. నూర్పులు జరిగి పొలాల్లో ఉండిపోయిన ధాన్యం లక్ష మెట్రిక్ టన్నుల వరకు ఉంటుంది. ఈ ధాన్యం తడిచిపోతోంది. ఈ ఏడాది పీపీసీల్లోనూ, ధాన్యం సేకరణ తర్వాత గోదాము సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. టార్పాలిన్లు కూడా అధికార పార్టీ కళ్లాలకు చేరినంత సులువుగా సామాన్యులకు చేరడం లేదనే విమర్శ ఉంది.
పాతపట్నం 16.4
మెళియాపుట్టి 16.2
జి.సిగడాం 16.8
బూర్జ 16.4
కొత్తూరు 14.2
పలాస 11.4
సంతబొమ్మాళి 11.0
టెక్కలి 10.8
నందిగాం 8.2
మందస 7.8
కవిటి 3.0
కంచిలి 2.8
సోంపేట 2.2
ఇచ్ఛాపురం 1.8
వజ్రపుకొత్తూరు 1.0
మండలం వర్షపాతం
(మిల్లీమీటర్లలో)
గార 40.2
శ్రీకాకుళం 34,8
ఎచ్చెర్ల 31.4
సరుబుజ్జిలి 29.0
ఆమదాలవలస 28.4
లావేరు 28.2
రణస్థలం 26.4
నరసన్నపేట 26.6
హిరమండలం 23.0
పోలాకి 20.8
కోటబొమ్మాళి 19.8
సారవకోట 19.4
పొందూరు 19.8
జలుమూరు 18.2
శుక్రవారం జిల్లాలో 540 మిల్లీమీటర్ల వర్షం
మరో 24 గంటల పాటు ఇదే పరిస్థితి
రైతుల్లో పెరుగుతున్న ఆందోళన
ఎల్‌ఎన్ పేట: వాడవలస వద్ద మొక్కజొన్న పొలంలోకి చేరిన నీరు
Comments
Please login to add a commentAdd a comment