వినియోగదారుల హక్కులపై అవగాహన
శ్రీకాకుళం పాతబస్టాండ్: వినియోగదారులు తమ హక్కుల గురించి తెలుసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. బాపూజీ కళామందిర్‌లో మంగళవారం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ సంయుక్తంగా జాతీయ వినియోగదారుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అమదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్ హాజరయ్యారు. కార్యక్రమానికి జిల్లా వినియోగదారుల సంఘం చైర్మన్ బగాది రామ్మోహన్ రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వినియోగదారులకు నష్టం జరిగితే సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అమదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్ మాట్లాడుతూ వినియోగదారునికి కొన్ని హక్కులున్నాయని వాటిని ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలని సూచించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి జి.సూర్యప్రకాష్ మాట్లాడుతూ వినియోగదారులు ఎక్కడైనా మోసపోతే మండల కేంద్రంలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ బి.మీనాక్షి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ కల్యాణ్‌బాబు, జీఎస్టీ సహాయ కమిషనర్ రాణి మోహన్, గంజి ఆర్ ఎజ్రా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment