హత్యలు.. అదృశ్యాలు.. చోరీలు.. వేధింపులు
బాలికను నమ్మించి మోసం చేసిన ఓ ప్రబుద్ధుడు ‘నేడు టీడీపీ కార్యకర్తను.. నన్నేం చేయలేరు’ అని ధైర్యంగా చెబుతున్నాడు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు దారి తప్పితే.. అధికార పార్టీకి చెందిన చోటా నాయకులు కేసును నీరు గార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పుట్టిన రోజు పార్టీ కోసం వెళితే ఏకంగా ఇద్దరిపై లైంగిక దాడికి పాల్పడి.. కేసు నుంచి తప్పించుకోవడానికి రాజకీయ పలుకుబడిని వాడుతున్నారు. తన గ్రూపులో డ్యాన్స్ వేయడం లేదని ఓ ప్రజా ప్రతినిధి అర్ధరాత్రి దారి కాచి మరీ దాడి చేస్తాడు. జిల్లాలో అతివలకు రక్షణ కరువైంది. పోలీసులు ఎంతగా ప్రయత్నిస్తున్నా.. మితిమీరిన రాజకీయ జోక్యం వారి ముందర కాళ్లకు బంధనాలు వేస్తోంది.
● గత ఏడాది అక్టోబరు 19 రాత్రి కాశీబుగ్గ కేంద్రంగా ఇద్దరు బాలికలను పుట్టిన రోజు వేడుకలకని పిలిచి ఇద్దరు యువకులు లైంగిక దాడి పాల్పడ్డాడు.
● గత అక్టోబరులో మహిళా కానిస్టేబుల్‌పై ఎస్‌ఐ అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె ఎస్పీకి ఫోన్‌లో ఫిర్యా దు చేశారు. ప్రస్తుతం ఆ ఎస్‌ఐ వీఆర్‌లో ఉన్నారు.
● ఇటీవల జిల్లాకేంద్రంలోని ఆర్మీకాలింగ్ పేరిట మైన ర్ బాలికల వసతి గృహాల్లో సీసీ కెమెరాలు పెట్టడమే కాక వారిని హింసించినట్లు బీవీ రమణపై బాధిత బాలికలు ఎస్పీ గ్రీవెన్సులో ఫిర్యాదు చేశారు.
● తాజాగా ఆమదాలవలస మండలంలో తొమ్మిదో తరగతి విద్యార్థినిని ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయం చూసి మత్తుమందు కలిపి లైంగిక దాడి చేసినట్లు వెలుగులోకి వచ్చింది.
● టెక్కలిలో ఓ టీచర్ పిల్లలకు అసభ్యకర సందేశాలు పంపిస్తూ దొరికిపోయారు.
శ్రీకాకుళం క్రైమ్ :
ఒంటరిగా రహదారులపై వెళ్తున్న మహిళలకు రక్షణ లేదు.. ఎవడు వచ్చి గొలుసులు తెంపుకుని వెళ్లిపోతాడో అని భయం. కళాశాలలకు, స్కూళ్లకు వెళ్తున్న బాలికలకు భరోసా లేదు. ఏ ఆకతాయి వచ్చి అల్లరి చేస్తాడో అని వణుకు. ఇళ్లలో ఉన్న ఆడపడుచులకు కూడా భద్రత లేదు.. ఏ అగంతకుడు వచ్చి చోరీ చేస్తాడో అని ఆందోళన. జిల్లాలో ఎన్నడూ చూడని విధంగా మహిళలకు భద్రత కరువైపోతోంది. ఓ వైపు పోలీసులు అరాచకాలు అరికట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా.. చాలా కేసుల్లో నిందితులు రాజకీయ పలుకుబడి ఉపయోగించి తప్పించుకుంటున్నారు.
● గత ఏడాది డిసెంబరు 16న ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలసలో మహిళను దారుణంగా హత్య చేశారు.
● గత అక్టోబరులో తమ డ్యాన్స్ గ్రూపులో ఉన్న బాలిక వేరే గ్రూపుతో వెళ్తుందని కక్ష కట్టి పలాస మండలం తెలుగు యువత అధ్యక్షులు కిక్కర ఢిల్లీరావు అర్ధరాత్రి దారికాచి ఆ బాలిక, ఆమె తల్లిపై దౌర్జన్యానికి దిగారు.
● గత ఏడాది కవిటి సమీపంలో ఓ చైన్ స్నాచర్ తన గ్రామానికే చెందిన మహిళా ఉపాధ్యాయురాలి తల బద్దలుగొట్టి మరీ గొలుసు తెంపాలని చూశాడు.
● శ్రీకాకుళంలో ఓ వృద్ధురాలి మెడపై కత్తితో బెదిరించి నోట్లో గుడ్డలు కుక్కి తాళ్లతో చేతులు, కాళ్లు మంచానికి కట్టి ఒంటిపై ఉన్న బంగారాన్నంతా తీసుకెళ్లిపోయారు.
● గత ఏడాది సెప్టెంబరు 25న సోంపేట మహదేవిపేటలో పట్టపగలు గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లో ప్రవేశించి మహిళ మెడకు కత్తిపెట్టి ఐదు తులాల బంగారాన్ని తెంపుకుపోయాడు.
మహిళలు
225
బాలికలు
78
కేసుల్లో కొన్ని..
మిస్సింగ్ కేసుల్లో మహిళలే అధికం..
అతివలపై నానాటికీ పెరుగుతున్న దాడులు
అరికట్టేందుకు పోలీసుల విశ్వ ప్రయత్నాలు
పోలీసుల కాళ్లకు బంధనాలు వేస్తున్న ‘రాజకీయ’ సంబంధాలు
Comments
Please login to add a commentAdd a comment