శ్రీకాకుళం
ఆదివారం శ్రీ 19 శ్రీ జనవరి శ్రీ 2025
పల్లె నుంచి పట్నానికి..!
సంక్రాంతి పూర్తవ్వడంతో తిరుగు ప్రయాణాలు మొదలయ్యాయి. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సులు కిటకిటలాడాయి.
–8లో
●దర్జాగా చెరువు కబ్జా ●కోటబొమ్మాళిలో టీడీపీ నేత బరితెగింపు
ప్రస్తుతం జోరుగా సాగుతున్న నిర్మాణం చిత్రం చూడండి. కోటబొమ్మాళి
మండల కేంద్రంలో చెరువును ఏకంగా ఆక్రమించి చేస్తున్న నిర్మాణమిది.
మంత్రి అనుచరుడు, టీడీపీ మండల నాయకుడు చేస్తున్న
నిర్వాకమిది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతీసారి
ఈయన ఆక్రమణ దందా సాగుతూనే ఉంది.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
అధికారం ఇచ్చింది అక్రమాలకు పాల్పడటానికే అన్నట్టుగా కొందరు టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. దాడులు, దౌర్జన్యాలు, కబ్జాలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించేయడమే పనిగా రెచ్చిపోతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల సహకారంతో దర్జాగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో కోర్టులో స్థల వివాదాలు ఉన్నప్పటికీ తీర్పులతో తమకు సంబంధం లేదన్నట్లుగా దౌర్జన్యాలకు దిగుతున్నారు. టెక్కలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్న కింజరాపు అచ్చెన్నాయుడు సొంత మండల కేంద్రంలో టీడీపీ మండల పార్టీ నాయకుడు దర్జాగా చెరువు గర్భాన్ని ఆక్రమించి మరీ అక్రమ కట్టడాలు నిర్మిస్తుండడంతో అంతా విస్తుపోతున్నారు. తన వెనుక మంత్రి ఉన్నారని.. ఎవరైనా అడ్డు వస్తే సహించేది లేదన్నట్లుగా మంత్రి పేరు చెప్పకుని దౌర్జన్యంగా అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు.
బరితెగింపు..
కోటబొమ్మాళి మండల కేంద్రంలో మార్కెట్‌కు ఎదురుగా సర్వే నెంబర్ 91/2లో సుమారు 28 ఎకరాల 34 సెంట్లు మేర పెద్ద చెరువు ఉంది. రెవెన్యూ రికార్డుల్లో సైతం చెరువు గర్భంగానే నమోదై ఉంది. ఇదే స్థలంలో దశాబ్ద కాలం క్రితం టీడీపీ నాయకుడు కొంత మేరకు రైస్ మిల్లు నిర్మాణం చేపట్టారు. అప్పట్లో అధికారులు పట్టించుకోలేదు. 2014లో టీడీపీ అధికారంలో వచ్చాక మరికొంత స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేశారు. అప్పట్లో వైఎస్సార్‌సీపీ నాయకులు అడ్డుకుని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వేలు చేసి ఆ స్థలం చెరువు గర్భంగా తేల్చారు. అంతేకాకుండా మండల రెవెన్యూ అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఫలితంగా ఆక్రమణలకు కొంత మేరకు ఫుల్‌స్టాప్ పడింది. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడంతో ఆక్రమించే సాహసానికి పోలేదు. ఇదే స్థలంలో కొంతమంది పేదలు రేకులు షెడ్లు వేసుకోగా అప్పట్లో రెవెన్యూ అధికారులు ఖాళీ చేయించారు. దీంతో స్థలం ఖాళీగా ఉండిపోయింది. ప్రస్తుతం కోటబొమ్మాళి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో స్థలానికి సంబంధించిన కేసు పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఆ స్థలంపై కన్నేసిన మండల టీడీపీ నేత అక్రమ కట్టడాలకు ఉపక్రమించారు. ఇటీవల జోరుగా నిర్మాణ పనులు చేస్తున్నారు. అంతేకాక మరికొంత స్థలంలో రేకుల షెడ్లు వేసుకుని అద్దెలకు కూడా ఇచ్చుకోవడం గమనార్హం.
న్యూస్‌రీల్
చెరువు గర్భంలో అక్రమ నిర్మాణాలు గతంలోనూ ఆక్రమణకు ప్రయత్నాలు అప్పట్లో అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు కోర్టులో కొనసాగుతున్న స్థల వివాదం కూటమి ప్రభుత్వం రావడంతో మళ్లీ అక్రమ నిర్మాణాలు
స్థలాన్ని పరిరక్షించాలి..
కోటబొమ్మాళిలో సర్వే నంబరు 91/2లో చెరువు గర్భంలో ఎటువంటి ఆక్రమణలు లేకుండా గతంలో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాం. దీంతో రెవెన్యూ అధికారులే కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం స్థలం సమస్య కోర్టు పెండింగ్‌లో ఉంది. ఇటీవల కాలంలో అదే స్థలంలో కట్టడాలు జరుగుతున్నాయి. ప్రజోపకారమైన పనుల కోసం వినియోగించాల్సిన స్థలంలో ఇలా ఆక్రమణలు జరుగుతున్నాయి. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి స్థలాన్ని పరిరక్షించాలి.
– కె.సంజీవరావు, సర్పంచ్, కోటబొమ్మాళి
ఆపమని ఆదేశించాం...
చెరువు గర్భంలో అక్రమ కట్టడాలు జరుగుతున్నట్లు మాకు సమాచారం వచ్చిన వెంటనే అక్కడకు వెళ్లి పరిశీలన చేశాం. అప్పటికే జరుగుతు న్న పనులను ఆపివేశాం. పూర్తి స్థాయిలో సామాన్లు తొలగించేందుకు రెండు రోజులు గడువు ఇచ్చాం. ఎటువంటి అక్రమ కట్టడాలు లేకుండా చర్యలు చేపడుతున్నాం.
– ఆర్.అప్పలరాజు, తహసీల్దార్, కోటబొమ్మాళి.
Comments
Please login to add a commentAdd a comment