●ఆకుల్లేని అరటి గెల
ఆ అరటి గెలను చూసిన ప్రతిఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఆకులు లేకుండానే గెల వేసిందా అని? ఆశ్చర్యపోతున్నారు. ఇచ్ఛాపురం మండలం ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామం సదాలపుట్టి గ్రామంలోని రైతు వీరాస్వామి పెరట్లో ఈ చెట్టు ఉంది. రెండు నెలల క్రితం వీచిన గాలులకు చెట్టులో కొంతభాగం విరిగిపోయింది. దీంతో చెట్టు మధ్య నుంచి కొత్తగా అరటి గెల ఏర్పడింది. – ఇచ్ఛాపురం రూరల్
●కమిషనర్‌పై కలెక్టర్ ఆగ్రహం!
● విధుల్లోకి చేరవద్దని ఆదేశం ● అనుమతి లేకుండా సెలవులే కారణం!
●హెల్మెట్ ధారణ తప్పనిసరి
●ప్రశాంతంగా జవహర్ నవోదయ పరీక్ష
శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ పి.పి.వి.డి.ప్రసాదరావుపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చర్యలు చేపట్టినట్లు సమాచారం. కమిషనర్ ఎటువంటి ముందుస్తు సమాచారాన్ని మున్సిపల్ ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్‌కు ఇవ్వకుండా సెలవులోకి వెళ్లినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. సంక్రాంతి సెలవులు అనంతరం విధుల్లోకి చేరవద్దని, ప్రభుత్వం కేటాయించిన వాహనాన్ని వారం పాటు నిలుపుదల చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు కలెక్టర్ టేబుల్‌పై ఫైల్ ఉందని తెలుస్తోంది. కమిషనర్ ముందుగా కలెక్టర్, ప్రత్యేకాధికారికి తెలియజేయకుండా సెలవుపై వెల్లడం ఇది మూడో సారి కావడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది నవంబర్‌లో కూడా సమాచారం ఇవ్వకుండా సెలవుపై వెళ్లినప్పుడు కలెక్టర్ హెచ్చరించారు. అయినా ఖాతరు చేయకుండా సంక్రాంతి సెలవులు తీసుకోవడం, కార్పొరేషన్ కార్యాలయంలో ఫైల్స్ పెండింగ్‌లో ఉండటం, స్పందన ఫిర్యాదులు సైతం పరిష్కారం చేయకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారని కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. చేతనైతే పనిచేయాలని, లేకుంటే దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఓ పక్క రాజకీయ ఒత్తిళ్లు, మరోవైపు అధికారులు ఒత్తిడి మేరకు కమిషనర్ విధులు నిర్వహించలేక ఇబ్బందిపడుతున్నారని కార్పొరేషన్‌లో పలువురు అధికారులు చెబుతున్నారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: ద్విచక్ర వాహనాలు నడిపే వారంతా విధిగా హెల్మెట్లు ధరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. శనివారం జిల్లా కోర్టు సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదన్నారు. హెల్మెట్‌తో ద్విచక్ర వాహనాలపై ప్రయాణం అత్యంత సురక్షితమని, అనుకోని పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు ప్రాణాలతో బయటపడేందుకు హెల్మెట్ రక్షణగా నిలుస్తుందని చెప్పారు. అనంతరం ఆంధ్రా ఆర్గానిక్ లిమిటెడ్(పైడి భీమవరం), పంజాబ్ నేషనల్ బ్యాంక్(సూర్యమహల్ బ్రాంచ్), ఇండియన్ బ్యాంక్(మహిళా కళాశాల బ్రాంచ్, అరసవిల్లి) సౌజన్యంతో పలువురు కోర్టు ఉద్యోగులకు హెల్మెట్లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు, 1వ అదనపు జిల్లా జడ్జి పి.భాస్కరరావు, 3వ అదనపు జిల్లా జడ్జి సి.హెచ్.వివేక్ ఆనంద్ శ్రీనివాస్, 4వ అదనపు జిల్లా జడ్జి ఎస్‌ఎం ఫణికుమార్, 6వ అదనపు జిల్లా జడ్జి(సోంపేట) కె.కిషోర్‌బాబు, సీనియర్ సివిల్ జడ్జి(రాజాం) కె.శారదాంబ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె.వి.ఎల్.హిమబిందు, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి సీహెచ్ యుగంధర్, సీనియర్ సివిల్ జడ్జి(సోంపేట) జె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం న్యూకాలనీ: జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలకుగాను శనివారం జిల్లా వ్యాప్తంగా 32 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా 8290 మంది విద్యార్థులకు గాను 7281 మంది హాజరయ్యారు. 1009 మంది గైర్హాజరయ్యారు. డీఈఓ డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య, జవహర్ నవోదయ విద్యాలయం వెన్నెలవలస ప్రిన్సిపాల్ దాసరి పరశురామయ్య, ఎగ్జామినేషన్స్ అసిస్టెంట్ కమిషనర్ లియాకత్ ఆలీఖాన్ పలు కేంద్రాలను తనిఖీ చేశారు.
●రేపటి నుంచి పశువైద్య శిబిరాలు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జిల్లా వ్యాప్తంగా ఈ నెల 20 నుంచి 31 వరకు పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు పశుసంవర్థకశాఖ సంయుక్త సంచాలకుడు రాజగోపాలరావు తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పశు వైద్యచికిత్సలు, వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందు, పశువ్యాధి నిర్ధారణ, పరీక్షలు, శాసీ్త్రయ యాజమాన్యంపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రతి మండలానికి రెండు బృందాలు కేటాయించామని, అందులో పశువైద్యాధికారి, పారా వెటర్నరీ సిబ్బంది, గోపాలమిత్ర, పశు సంవర్థక సహాయకులు, అటెండర్ ఉంటారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment