ఆమె నేత్రాలు సజీవం | - | Sakshi
Sakshi News home page

ఆమె నేత్రాలు సజీవం

Published Sun, Jan 19 2025 1:07 AM | Last Updated on Sun, Jan 19 2025 1:07 AM

ఆమె న

ఆమె నేత్రాలు సజీవం

శ్రీకాకుళమ కల్చరల్‌ : నగరంలోని పీఎన్‌ కాలనీలో 7వ లైన్‌లో నివాసముంటున్న తిర్లంగి అన్నపూర్ణమ్మ(73) గుండెపోటుతో శనివారం మృతిచెందారు. మరణాంతరం ఆమె నేత్రాలు ఇతరులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో కుటుంబసభ్యులు రమేష్‌, రోహిణికుమారి, రవిప్రసాద్‌, రోజాకుమారిలు రెడ్‌క్రాస్‌కు తెలియజేయగా.. నేత్ర సేకరణ కేంద్రం టెక్నికల్‌ ఇన్‌చార్జి పి.సుజాత, సహాయకులు పి.సుమతి స్పందించారు. అన్నపూర్ణమ్మ కార్నియాలను సేకరించి విశాఖలోని ఎల్‌వీప్రసాద్‌ నేత్ర సేకరణ కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులను రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ జగన్మోహనరావు, హర్షవర్దన్‌, దుర్గాశ్రీనివాస్‌లు అభినందించారు. నేత్రదానం చేయాలనుకునేవారు 7842 699321 నంబరును సంప్రదించాలని కోరారు.

పరిసరాల శుభ్రతతోనే ఆరోగ్యం

నరసన్నపేట: మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యంగా ఉండగలమని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. స్వచ్చ ఆంధ్ర–స్వచ్ఛ దివాస్‌ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. నరసన్నపేట తహసీల్దార్‌ కార్యాలయం వద్ద శనివారం స్వచ్ఛ ఆంధ్ర–స్వచ దివాస్‌ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మూడో శనివారం కార్యక్రమం విధిగా చేపటా లని ఆదేశించారు. నరసన్నపేటలో ఎక్కడికక్క డ చెత్త కనిపించిందని, భవిష్యత్తులో ఈ పరిస్థి తి ఉండకూడదన్నారు. కార్యక్రమంలో డీపీఓ భారతి సౌజన్య, డీపీఆర్‌సీ నిశ్చల, ఎంపీడీఓ మధుసూదనరావు, తహసీల్దార్‌ సత్యనారాయ ణ, ఈఓ ద్రాక్షాయిని, ఈఓపీఆర్‌డీ రేణుక, ఉప సర్పంచ్‌ ఎస్‌.కృష్ణబాబు పాల్గొన్నారు.

గడ్డి కుప్పలు దగ్ధం

రణస్థలం: రణస్థలం పంచాయతీ నగరప్పాలెం గ్రామంలో గంట్యాడ దాలినాయుడుకు చెందిన గడ్డి కుప్పలు శనివారం మధ్యాహ్నం అగ్నికి అహుతైనట్లు అగ్నిమాపక అధికారి పైల అశోక్‌ తెలిపారు. వెంటనే రణస్థలం అగ్నిమాపక శకటం వచ్చి గడ్డి కుప్పలకు అంటుకున్న మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
ఆమె నేత్రాలు సజీవం 1
1/1

ఆమె నేత్రాలు సజీవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement