రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
సరుబుజ్జిలి: మండలంలోని కొత్తకోట సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హిరమండలం మండలం కొండరాగోలు గ్రామానికి చెందిన సన్నబోయిన చంద్రశేఖర్(25) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు చంద్రశేఖర్ దుబాయ్‌లో వెల్డింగ్ పనులు చేస్తూ ఇటీవల సంక్రాంతి పండగకు తన స్వగ్రామం వచ్చాడు. ఆమదాలవలసలో ఉన్న తన స్నేహితుడిని కలిసేందుకు ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. ఆ సమయంలో ఆమదాలవలస నుంచి సరుబుజ్జిలి వైపు వెళ్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఘటన స్థలంలోనే మృతి చెందాడు. మృతుడి తండ్రి తిరుపతిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని సర్వజన ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించినట్లు ఎస్‌ఐ బి.హైమావతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment