వేమన శతకాలు ఆచరణీయం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ప్రజాకవి యోగి వేమన అని, ఆయన శతకాలు ఆచరణీయమని రెడ్డిక సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుక్క రాజశేఖరరెడ్డి అన్నారు. వేమన జయంతి సందర్భంగా ఆదివారం శ్రీకాకుళంలోని రెడ్డిక సంక్షేమ సంఘ కార్యాలయంలో వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాకవిగా, సంఘ సంస్కర్తగా ‘విశ్వదాభిరామ వినురవేమ’ అనే మకుటంతో పద్యాలు రాసిన మహనీయుడు వేమన అని పేర్కొన్నారు. వేమన పద్యం తెలియని తెలుగు విద్యార్థి లేనడంలో అతిశయోక్తి లేదన్నారు. కప్పు మాధవరెడ్డి మాట్లాడుతూ జీవనసారాన్ని తత్వాలుగా బోధించిన వేమన ఆరాధ్య కవిగానే కాదు ఆరాధ్య దైవంగానూ గుర్తించవచ్చన్నారు. కార్యక్రమంలో అలపాన త్రినాథరెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులు నీలపు రామబాబురెడ్డి, ప్రొఫెసర్ దూడ విష్ణుమూర్తి రెడ్డి, బాకి వేణుగోపాలరెడ్డి, సూర్యరెడ్డి, పడపాన సుగుణారెడ్డి, రత్నకుమారి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment