ముగిసిన గ్రిగ్స్ పోరు
● బాలబాలికల ఆల్‌రౌండ్ చాంపియన్స్‌గా శాస్త్రులపేట, పలాస ఎంజేపీ పాఠశాలలు
శ్రీకాకుళం న్యూకాలనీ:
జిల్లాస్థాయి పాఠశాలల గ్రిగ్స్ ఫైనల్స్ పోరు ముగిసింది. మూడు రోజులపాటు సాగిన పోటీలు శుక్రవారం సాయంత్రంతో ముగిశాయి. జిల్లా విద్యాశాఖ పరిధిలోని జిల్లా పాఠశాలల క్రీడల సంఘం ఆధ్వర్యంలో స్థానిక టీపీఎంహెచ్ స్కూల్ సారధ్యంలో శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం ప్రాంగణంలో జరిగిన ఈ పోటీల్లో తొలిరోజు బాలురుకు 10 క్రీడాంశాల్లో, రెండోరోజు బాలికలకు 8 క్రీడాంశాల్లో, ఆఖరి, మూడవరోజైన శుక్రవారం బాలబాలికలకు అథ్లెటిక్స్ ఈవెంట్స్ నిర్వహించారు.
ఆల్‌రౌండ్ ఛాంపియన్స్‌గా శాస్త్రులపేట, పలాస..
అథ్లెటిక్స్ ఈవెంట్స్‌లో బాలబాలికలకు 100, 200, 400, 800, 1500, 3000 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, హైజంప్, ట్రిపుల్‌జంప్, షాట్‌పుట్, డిస్కస్‌త్రో, జావెలిన్‌త్రో, 400 మీటర్ల రిలే పరుగు పోటీల్లో సీతాపురం, శాస్త్రులపేట, పలాస, గోవిందపురం, ఇచ్ఛాపురం, కుప్పిలి, ఇప్పిలి, యందువ, ఈదుళ్లవలస తదితర పాఠశాలల క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. స్పోర్ట్స్ చాంపియన్స్‌గా జెడ్పీహెచ్ స్కూల్ సీతాపురం(బాలుర విభాగం), జెడ్పీహెచ్ స్కూల్ కుప్పిలి (బాలికల విభాగం) నిలిచాయి. వ్యక్తిగత చాంపియన్లగా పి.హర్షవర్ధన్ (సీతాపురం), బి.దుర్గ (కుప్పిలి) నిలిచారు. మొత్తమ్మీద మూడు రోజుల గ్రిగ్స్‌మీట్‌లో ఆల్‌రౌండ్ చాంపియన్‌షిప్‌ను బాలురు విభాగంలో ఎంజేపీ స్కూల్ శాస్త్రులపేట, బాలికల విభాగంలో ఎంజేపీ స్కూల్ పలాస కై వశం చేసుకున్నాయి.పోటీలను విజయవంతం చేసిన ప్రతిఒక్కరికి పాఠశాలల క్రీడల సంఘం గ్రిగ్స్ సెక్రటరీ కె.మాధవరావు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు మొజ్జాడ వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి, గ్రిగ్స్ సెక్రటరీ కె.మాధవరావు, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ బీవీ రమణ, సంపతిరావు సూరిబాబు, పి.తవిటియ్య, మెట్ట తిరుపతిరావు, వై.పోలినాయుడు, బి.నిర్మల్‌కృష్ణ, నారాయణరావు, రాజారావు, శ్రీనివాసరావు, యశోద, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment