![‘పీఎం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07cto582-280010_mr-1738955531-0.jpg.webp?itok=VpgYDeU3)
‘పీఎంజే’లో సరికొత్త వజ్రాభరణాలు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఫైన్ జ్యూయలరీ బ్రాండ్ పీఎంజే జ్యువెల్స్ అని ఆమదాలవలస ఎమ్మెల్యే సతీమణి కూన ప్రమీల అన్నారు. శ్రీకాకుళం జీటీ రోడ్డులో ఏర్పాటు చేసిన పీఎంజే నూతన జ్యూయలరీ షాపును శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ ఆంధ్రప్రదేశ్ బిజినెస్ హెడ్ హైదర్ ఆలీ, వైజాగ్ క్లస్టర్ డైరెక్టర్ ఆనంద్ జిలగం మాట్లాడుతూ నాణ్యతకు, నమ్మకానికి అనువైన షాపు పీఎంజే అని చెప్పారు. సిక్కోలు ప్రజల అభిరుచులకు తగినట్లుగా అన్ని రకాల ఆభరణాలు అందుబాటులో ఉంచామన్నారు. వజ్రాలు, బంగారం విలువైన స్టోన్స్‌తో కూడిన విస్తృత డిజైన్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. వివాహాది, శుభకార్యాలకు, వేడుకలకు అనువైన తేలికపాటి క్రియేషన్లు కూడా స్టోర్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో సరికొత్త డిజైన్లను చూసేందుకు నగరవాసులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
నేటి నుంచి బొరివంకలో
అంతర్రాష్ట్ర నాటక పోటీలు
కవిటి: మండలంలోని బొరివంకలో శనివారం నుంచి అంతరాష్ట్ర నాటక పరిషత్ పోటీలు ప్రారంభం కానున్నాయి. కళింగ సీమ కళాపీఠం సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొదటి నాటక పరిషత్ పోటీల్లో శనివారం రాత్రి 7 గంటలకు గుంటూరు జిల్లా కొలకలూరుకు చెందిన సాయి ఆర్ట్స్ వారి ‘జనరల్ బోగీలు’ అనే నాటిక ప్రదర్శన ఉంటుంది. 9 గంటలకు రెండో ప్రదర్శనగా ‘నిశ్శబ్దమా నీ ఖరీదెంత?’ అనే నాటిక ప్రదర్శిస్తారు. జిల్లా నలుమూలల నుంచి కళాభిమానులు, కళాకారులు పెద్దసంఖ్యలో హాజరై కార్యక్రమాల్ని విజయవంతం చేయా లని సంస్థ అధ్యక్షుడు బల్లెడ లక్ష్మణమూర్తి కోరారు.
![‘పీఎంజే’లో సరికొత్త వజ్రాభరణాలు 1](https://www.sakshi.com/gallery_images/2025/02/8/07smp42-280057_mr-1738955531-1.jpg)
‘పీఎంజే’లో సరికొత్త వజ్రాభరణాలు
Comments
Please login to add a commentAdd a comment