జిల్లా వ్యాప్తంగా 87శాతం సర్వే పూర్తి
నేరేడుచర్ల: సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఉపాధి, విద్య, కుల సర్వే జిల్లాలో 87శాతం వరకు పూర్తయిందని అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. గురువారం నేరేడుచర్లలోని తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాలను ఆయన తనిఖీ చేశారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో 3,69,040 గృహాలకు ఇప్పటి వరకు 3,19,100 గృహాలను సర్వే చేసినట్లు చెప్పారు. వివరాలను మున్సిపల్, తహసీల్దార్ కార్యాలయాల్లో డేటా ఎంట్రీ చేస్తున్నట్లు తెలిపారు. గృహాల్లో అందుబాటులో లేని వారివి, ఇతర ప్రాంతాల్లో ఉండే వారివి మాత్రమే సర్వే పూర్తి కాలేదన్నారు. ఈ రెండు, మూడు రోజుల్లో వంద శాతం సర్వే పూర్తవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సమగ్ర కుటుంబ సర్వేలో సూర్యాపేట జిల్లా ఐదవ స్థానంలో నిలిచిందన్నారు. ఇప్పటి వరకు 70 వేల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యాన్ని, 2100 మెట్రిక్ టన్నుల సన్నధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్పారు. రైతులకు రూ.12లక్షల వరకు బోనస్‌ను చెల్లించడం జరిగిందన్నారు. సమావేశంలో తహసీల్దార్ సురభీ సైదులు, మున్సిపల్ చైర్మన్ ప్రకాశ్, కమిషనర్ అశోక్‌రెడ్డి, ఎంపీడీఓ సుందర్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ మౌనిక తదితరులున్నారు.
అదనపు కలెక్టర్ రాంబాబు
Comments
Please login to add a commentAdd a comment