విద్యాబోధన ఆగకుండా..
సూర్యాపేటటౌన్ : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సమ్మె చేస్తుండడంతో విద్యాబోధనకు ఆటంకం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. జిల్లాలో 435 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికి ఈ నెల 6 నుంచి సమ్మె చేస్తున్నారు. వారిలో అత్యధికంగా కేజీబీవీల్లో పనిచేసే సీఆర్టీలు, బోధనేతర సిబ్బంది ఉన్నారు. వీరంతా సమ్మె చేస్తుండడంతో విద్యాలయాల్లో చదివే బాలికలకు పాఠాలు బోధించేవారు కరువయ్యారు. ఈక్రమంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు విద్యా శాఖ తాత్కాలికంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు అదనపు విధులు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
కేజీబీవీల్లో 3,409 మంది విద్యార్థినులు
జిల్లాలో 23 మండలాలకు కలిపి 18 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యాబోధన అందుతోంది. ఈ విద్యాలయాల్లో మొత్తం 3,409 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఇంటర్, పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెతో కేజీబీవీల్లో టెన్త్, ఇంటర్ ఫలితాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
ఫ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెతో కేజీబీవీల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
ఫ ప్రభుత్వ ఉపాధ్యాయులకు
అదనపు బాధ్యతలు
ఫ ప్రతి స్కూల్‌కు నలుగురు
చొప్పున కేటాయింపు
విద్యార్థినులు నష్టపోకుండా చర్యలు
ప్రభుత్వ పాఠశాలల్లో అదనంగా ఉన్న ఉపాధ్యాయులను గుర్తించాం. కొన్ని ఉన్నత పాఠశాలల్లో ఒక్కో సబ్జెక్టుకు ఇద్దరు, నలుగురు ఉపాధ్యాయులు ఉన్న వారిని కేజీబీవీలకు డిప్యుటేషన్‌పై పంపిస్తున్నాం. విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో అన్ని కేజీబీవీల్లో పూర్తి స్థాయిలో బోధన కొనసాగుతుంది. బోధన, భోజనానికి ఇతర సౌకర్యాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం.
– అశోక్, డీఈఓ, సూర్యాపేట
జిల్లాలో కేజీబీవీలు 18
తరగతులు 6 నుంచి 12
విద్యార్థుల సంఖ్య 3,409
సమ్మె చేస్తున్న ఉద్యోగులు 354
Comments
Please login to add a commentAdd a comment