చెస్‌తో మేధాశక్తి పెంపొందుతుంది
సూర్యాపేట: చెస్ ఆడడం వల్ల విద్యార్థుల్లో మేధాశక్తి పెంపొందుతుందని చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గండూరి కృఫాకర్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి అండర్–7, 9, 11, 15 బాలబాలికల చెస్ పోటీల్లో విజేతలైన వారికి షీల్డ్‌లు, సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడారు. అంతకుముందు గండూరి కృపాకర్ తన పుట్టిన రోజు సందర్భంగా అసోసియేషన్ సభ్యులు క్రీడాకారుల సమక్షంలో భారీ కేక్ కట్ చేశారు. చెస్ పోటీల్లో పాల్గొన్న వంద మంది విద్యార్థులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వంద మంది క్రీడాకారులు హాజరుకాగా 24మంది విజేతలుగా నిలిచారన్నారు. కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.సతీష్‌కుమార్, ఉపాధ్యక్షుడు సాయికుమార్, సహాయ కార్యదర్శి లింగారెడ్డి, కోశాధికారి వెంకటమురళి, కార్యవర్గ సభ్యులు జానయ్య, రాజేష్, నరసింహారావు, మచ్చ శాంతకుమార్, భిక్షం, కళ్యాణ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment