సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం
సూర్యాపేట టౌన్: సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలమైందని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో అహర్నిశలు కృషి చేస్తారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకుని తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పలువురు ఉపాధ్యాయులకు సూర్యాపేటలోని శ్రీలక్ష్మీ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో ఆదివారం సావిత్రిబాయి ఫూలేె అవార్డ్స్–2025 ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి జగదీష్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలను విద్యావంతులను చేయాలని ఆలోచించిన మహాత్మా జ్యోతిరావు ఫూలే ముందుగా తన సతీమణి సావిత్రిబాయి ఫూలేను చదివించి ఉపాధ్యాయురాలిని చేశాయడం గొప్ప విషయమన్నారు. తొలి మహిళా ఉధ్యాయురాలిగా ఆమె జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని ఆమె ఎన్నో పోరాటాలు చేశారన్నారు. దేశం గర్వించదగ్గ గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చల్లమల్ల నర్సింహ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు దామెర శ్రీనివాస్, మట్టపల్లి రాధాకృష్ణ, వేణుగోపాల్‌రెడ్డి, సౌజన్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment