ఆరు గ్యారంటీలను అమలు చేయాలి
మిర్యాలగూడ: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మిర్యాలగూడలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి 26 నుంచి రైతు భరోసా కింద రూ.12వేలు, భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు రూ.12వేలు, రేషన్‌కార్డులను అందిస్తామని చెప్పిందని వాటిని అర్హులైన వారందరికీ అందించాలన్నారు. రైతు భరోసా కింద రూ.15వేలు అందిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు రూ.12వేలు ఇస్తామనడం సరికాదన్నారు. గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్‌లు పంపిణీ చేయకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయని.. వాటికి మరమ్మతులు చేపట్టి అర్హులైన పేదలకు అందించాలన్నారు. లేకుంటే ప్రజలను సమీకరించి ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, శశిధర్‌రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, వినోద్‌నాయక్, రెమిడాల పరశురాములు, రొండి శ్రీనివాస్, చౌగాని సీతారాములు, బావండ్ల పాండు, సైదులు, మల్లయ్య, సైదులు, శ్రీనివాస్‌రెడ్డి, చౌగాని వెంకన్న, కోటిరెడ్డి, రామకృష్ణ, సైదులు, లింగయ్య, రాంరెడ్డి, సైదానాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment