భారంగా ‘మధ్యాహ్నం’ గుడ్డు | - | Sakshi
Sakshi News home page

భారంగా ‘మధ్యాహ్నం’ గుడ్డు

Published Mon, Jan 6 2025 7:12 AM | Last Updated on Mon, Jan 6 2025 7:12 AM

భారంగ

భారంగా ‘మధ్యాహ్నం’ గుడ్డు

తిరుమలగిరి (తుంగతుర్తి): కోడి గుడ్ల ధర రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే వంట ఏజెన్సీ నిర్వాహకులు గుడ్డు పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా విద్యార్థులు పోషకాహారానికి దూరం అవుతున్నారు. అయితే మధ్యాహ్న భోజనం అమలులో భాగంగా ప్రతి సో మ, బుధ, శుక్రవారాల్లో విద్యార్థులకు కోడి గుడ్డు అందించాలి. కానీ కొన్ని పాఠశాలల్లోనే ఒకటి, రెండుసార్లు మాత్రమే విద్యార్థులకు కోడి గుడ్లు అందిస్తున్నారు. మిగతా వాటిల్లో సక్రమంగా అందించడం లేదు. కాగా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 981 ఉండగా విద్యార్థులు 5,191 మంది ఉన్నారు.

ప్రభుత్వం చెల్లించేది ఐదు రూపాయలే..

ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో కోడి గుడ్డు అందించేందుకు గాను ఒక్కోదానికి రూ.5 చెల్లిస్తోంది. కానీ, ప్రస్తుతం మార్కెట్‌లో ఒక్కో కోడి గుడ్డు ధర ఏడు రూపాయలు పలుకుతోంది. దీంతో నిర్వాహకులకు ఆర్థిక భారంగా మారింది. మధ్యాహ్న భోజనంలో నెలకు 12 సార్లు గుడ్డు ఇవ్వాలి. ప్రస్తుతం రూ.5 మాత్రమే చెల్లిస్తుండటంతో ఒక్కొక్కరిపై అదనంగా నెలకు రూ.24 భారం పడుతుందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భారం భరించలేక కొన్ని పాఠశాలల్లో వారంలో రెండుసార్లు కోడి గుడ్డు ఇచ్చి మరో రోజు అరటి పండు లాంటివి ఇస్తున్నారు.

నవంబర్‌ నుంచి ధర పెరగడంతో..

ప్రాథమిక పాఠశాలలతో పాటు ఆదర్శ పాఠశాలలు, ఇతర ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎక్కువ మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనంతో ఆకలి తీర్చుకుంటున్నారు. వారానికి మూడుసార్లు అందించాలి. కానీ, గత ఆగస్టులో మార్కెట్‌లో ఒక్కో గుడ్డు ధర రూ.4.50 ఉండగా నవంబర్‌ నుంచి రూ.7కు పెరిగింది. దీంతో నిర్వాహకులపై రూ.2 అదనపు భారం పడుతుందని, మరోవైపు ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి గుడ్ల బిల్లులు సరిగా రావడం లేదని కార్మికులు వాపోతున్నారు.

ఫ ధర పెరగడంతో పాఠశాలల్లో

సక్రమంగా అందించని వంట ఏజెన్సీలు

ఫ వారంలో మూడుసార్లు ఇవ్వాల్సి ఉన్నా ఒకటి, రెండింటితోనే సరి

ఫ పోషకాహారానికి

దూరమవుతున్న విద్యార్థులు

ఆర్థిక భారం పడుతోంది

విద్యార్థులకు వారానికి మూడుసార్లు గుడ్డు అందజేస్తున్నాం. ప్రభుత్వం ఒక్కో గుడ్డుకు రూ.5 చెల్లిస్తుండగా దుకాణాల్లో మాత్రం వాటి ధర రూ.7కు పెరిగింది. దీంతో ఒక్కో విద్యార్థిపై నెలకు రూ.24 ఖర్చు చేయాల్సి వస్తుండడంతో మాపై ఆర్థిక భారం పడుతోంది.

– మంజూల, మధ్యాహ్న

భోజన నిర్వాహకురాలు, తిరుమలగిరి

ధరలకు అనుగుణంగా చెల్లింపులు ఉండాలి

మార్కెట్‌లో ఒక్కో గుడ్డును రూ.7 చొప్పున కొనుగోలు చేసి తెచ్చి విద్యార్థులకు వండి పెడుతున్నాం. వారంలో మూడుసార్లు కోడి గుడ్డు పెట్టాల్సి వస్తోంది. మార్కెట్‌లో ప్రస్తుతం ఉన్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వం వంట ఏజెన్సీలకు కోడి గుడ్లకు ఇస్తున్న రేటు పెంచాలి.

– శోభ, మధ్యాహ్న భోజనం

ఏజెన్సీ నిర్వాహకురాలు, అనంతారం

No comments yet. Be the first to comment!
Add a comment
భారంగా ‘మధ్యాహ్నం’ గుడ్డు1
1/2

భారంగా ‘మధ్యాహ్నం’ గుడ్డు

భారంగా ‘మధ్యాహ్నం’ గుడ్డు2
2/2

భారంగా ‘మధ్యాహ్నం’ గుడ్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement