విద్యార్థినుల బోధనకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులకు అదనపు విధులు కేటాయించేందుకు ఆయా మండలాల ఎంఈఓలు కసరత్తు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అదనంగా ఉన్న ఉపాధ్యాయులను గుర్తించి వారిని కేజీబీవీల్లో విధులు నిర్వహించేలా ఏర్పాటు చేస్తున్నారు. సీనియర్ మహిళా ఉపాధ్యాయులను కేజీబీవీల్లో తాత్కాలికంగా ప్రత్యేక అధికారులుగా నియమించారు. అలాగే ప్రతి కేజీబీవీకి నలుగురు ఉపాధ్యాయుల చొప్పున నియమించారు. ఇప్పటికే కొందరు ఉపాధ్యాయులు కేజీబీవీలకు వెళ్లి పాఠాలు బోధిస్తున్నారు. త్వరలో అన్ని కేజీబీవీల్లో సబ్జెక్టు ఉపాధ్యాయులను నియమించనున్నారు. అదేవిధంగా ఎమ్మార్సీల్లో పనిచేస్తున్న 354 మంది సమ్మెలోకి వెళ్లడంతో కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. వంట ఏజెన్సీల బిల్లుల నమోదు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల పనుల వివరాలు, పాఠ్య, రాత పుస్తకాలు, యూనిఫామ్ కేటాయింపు, విద్యార్థుల ఫేస్ హాజరు, కొత్తగా చేరిన విద్యార్థుల వివరాలు, మార్కుల వివరాల నమోదు ప్రక్రియ నిలిచిపోయింది. వీరి స్థానంలో కూడా ఉపాధ్యాయులను నియమించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో అదనంగా ఉన్న ఉపాధ్యాయులను ఎమ్మార్సీలకు డిప్యుటేషన్‌పై పంపాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment